calender_icon.png 10 December, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదం: ముగ్గురు మృతి

10-12-2025 08:21:58 AM

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad district) బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. జిల్లాలోని జైనథ్ మండలం తరోడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను ఆదిలాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తలించారు.