ఆ అనుభూతిని వర్ణించలేను!
హరీశ్ శంకర్, పవన్‌కళ్యాణ్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న విడుదల కానుంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీలతోపాటు మరో అందాల భామ రాశీ ఖన్నా కూడా నటిస్తున్నారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి రాశీ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కలిసి నటించాలనేది తన కెరీర్ బిగినింగ్ నుంచి ఉన్న పెద్ద కల అని, అది ‘ఉస్తాద్’తో తీరిందని రాశీ భావోద్వేగంతో చెప్పారు. “పవన్ సెట్స్‌లో ఉంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వర్ణించలేం. ఆయన పక్కన డాన్స్ చేయడం నా కెరీర్‌లోనే మర్చిపోలేని అనుభూతి. హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్‌లోని అసలైన మాస్ యాంగిల్‌ను, ఆ పాత రోజుల్లోని జోష్ పక్కాగా ప్రజెంట్ చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో సాంగ్స్ రేంజ్ మరో లెవల్‌లో ఉండబోతున్నాయి” అని తెలిపింది.




