2 May, 2026 | 9:06 PM

Breaking News

అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •  

హ్యాపీ రాజ్ వచ్చేది అప్పుడే

14-03-2026 01:18 AM

మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్‌లోనూ దూసుకుపోతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. ఈ చిత్రంలో కంపోజర్-హీరో జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించారు. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద నిర్మించారు. ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీగౌరీప్రియ హీరోయిన్‌గా నటిచింది. రిఫ్రెషింగ్ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇంకా అబ్బాస్, జార్జ్, గీతా కైలాసం, ప్రార్థన నాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: మధన్ క్రిస్టోఫర్; సంగీతం: జస్టిన్ ప్రభాకరన్; ఎడిటర్: ఆర్‌కే సెల్వ; ప్రొడక్షన్ డిజైన్: కుమార్ గంగప్పన్.