calender_icon.png 23 December, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు హరిత ఫౌండేషన్ చేయుత

23-12-2025 08:54:07 PM

హుజూర్ నగర్: ప్రభుత్వ విద్యారంగానికి పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం సమాజ శ్రేయస్సుకోసం హరిత ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థుల కోసం రోబోటిక్స్ నందు  అవగాహన నిర్వహించి ఎంఈఓ సైదా నాయక్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం హరిత ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం హరిత ఫౌండేషన్ చైర్మన్ ఫణి రాజ్ కుమార్ ని, సభ్యులు కేశవరెడ్డిని అభినందించారు. హరిత ఫౌండేషన్ వారు విద్యార్థులకు టీ షర్ట్స్, షూస్ అందజేశారు.