23-12-2025 08:51:09 PM
నవజాత శిశువుల ఆరోగ్యానికి ప్రాధాన్యత
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నిండు ఆరోగ్యంతోనే సంపూర్ణ జీవితం లభిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రసవం అయిన మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన నవజాత శిశువుల తల్లులకు, తన స్వంత నిధులతో తయారు చేయించిన యెన్నం హెల్త్ కిట్‌లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నవజాత శిశువులు వారి తల్లుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని పేర్కొన్నారు.
మాతా–శిశు ఆరోగ్యం మెరుగుపడేలా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, ఆర్ఎంఓ డాక్టర్ దుర్గ, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.