25-01-2026 12:11:15 AM
న్యూఢిల్లీ, జనవరి ౨౪: దేశ రాజధానిలోని పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం జరుగ నున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ పోలీసులు సరికొత్త భద్రతా వ్యూహాన్ని అమ లు చేయనున్నారు. నిఘాలో భాగంగా భద్ర తా బలగాలు, పోలీసులు అత్యంత శక్తిమంతమైన ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌ను వినియోగించ నున్నారు. భారత్‌కు చెందిన స్టార్టప్ ’అజ్నాలెన్స్’ ఈ ఏఐ గ్లాసెస్‌ను తయారు చేసింది.
ఈ పరికరం చూడటానికి సాధారణ కళ్లద్దాల్లా కనిపిస్తాయి.కానీ, వీటి వెనుక ఎంతో సాంకేతికత దాగి ఉంది. రద్దీగా ఉండే ప్రాం తాల్లో ప్రతి వ్యక్తి ముఖాన్ని ఈ కళ్లద్దాలు క్షణాల్లో స్కాన్ చేస్తాయి. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఈ కళ్లద్దాలు క్షణాల్లో సుమారు 65 వేల మంది పాత నేరస్థుల డేటా బేస్‌ను బేరీజు వేస్తుంది. ఒకవేళ ఎవరైనా పాత నేరస్థులు ఎదురుపడితే పోలీసులను అలెర్ట్ చేస్తుంది.
కళ్లద్దాలు పెట్టుకున్న పోలీసు మొబైల్‌లో అవతలి వ్యక్తి వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఒక వ్యక్తి తన రూపాన్ని మార్చుకున్నా లేదా ముఖంపై ఎలాంటి మాస్కు ధరించినా గుర్తుపట్టడం ఈ కళ్లద్దాల ప్రత్యేకత. కళ్లద్దాల్లో థర్మల్ ఇమేజింగ్ సదుపాయమూ ఉంది. దీని ద్వారా ఎవరైనా దుస్తుల లోపల రహస్యంగా ఆయుధాలు లేదా ఇనుప వస్తువులు దాస్తే వాటిని కూడా కళ్లద్దాలు పసిగట్టి అలెర్ట్ చేస్తాయి. అలాగే.. కళ్లద్దాలకు అందే డేటా ఎక్కడా లీక్ కాకుండా ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది ఢిల్లీ పోలీసులు మొదటిసారిగా ఉపయోగిస్తున్న ఈ సాంకేతికత భవిష్యత్తులో పోలీసింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.
ఉగ్ర కుట్ర భగ్నం.. 2.5 కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు శనివారం ఇంటెలిజెన్స్ అధికారులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఉగ్ర మూకలు వేడుకల్లో దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అం దుకుని పంజాబ్‌లో ఖలిస్థానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెంది న ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.5 కిలోల ఆర్డీఎక్స్‌తోపాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నా రు. నిందితులను శరణ్‌ప్రీత్ సింగ్, దిల్జోత్ సింగ్ సైనీ, హర్మాన్, అజయ్, అర్ష్దీప్ సింగ్‌గా గుర్తించారు. అమెరికాకు చెందిన బబ్బర్ ఖల్సా గ్రూప్ వీరందరితో ఉగ్ర కుట్ర పన్నాయని తెలిపారు.