calender_icon.png 25 January, 2026 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో మంచు బీభత్సం

25-01-2026 12:08:42 AM

  1. 9,000 విమాన సర్వీసులు రద్దు
  2. 17 రాష్ట్రాల్లో ౨ కోట్లమందిపై ప్రభావం

దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిన అగ్రరాజ్యం

వాషింగ్టన్, జనవరి ౨౪: అమెరికాలోని రాకీ పర్వతాల నుంచి తూర్పు తీరానికి వరకు విస్తరించిన ఈ భారీ మంచు తుపాను సుమారు 20 కోట్ల మందిపై ప్రభావం చూపుతున్నది. ఏకంగా 17 రాష్ట్రాల ప్రజలు కేవలం ఇంటికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మంచు బీభత్సం కారణంగా ఏకంగా శని, ఆదివారాల్లో సుమారు 9 వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. డల్లాస్, చికాగో, న్యూయార్క్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో మంచుకుప్పలు పేరుకుపోయాయి.

అత్యవసర పరిస్థి తుల దృష్ట్యా అమెరికన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు తుపాను ధాటికి దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటం, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. దీంతో లక్షలాది ఇళ్లు చీకటిలో మగ్గి పోతున్నాయి.  పౌరులు తమ ఇళ్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూ చించింది. రోడ్లపై మంచు గడ్డకట్టడం వల్ల వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొంటున్నాయి.

తాజాగా మిచిగాన్‌లోని హైవేపై ఏకంగా 100కు పైగా వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. పలు చోట్ల వాహ నాలు మంచులో కూరుకుపోవడంతో ప్ర యాణికులు గంటల తరబడి రహదా రులపైనే చిక్కుకుపోతున్నారు. ముఖ్యంగా లూసియానా, మిసిసిపీ, టెన్నెసీ వంటి ప్రాంతాల్లో రోడ్లపై భారీగా మంచు పేరుకుందని, ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.