calender_icon.png 3 August, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏ బాధ్యులపై సస్పెన్షన్ వేటు

01-08-2025 01:42:09 AM

  1. ఉత్తర్వులు జారీ చేసిన అపెక్స్ కౌన్సిల్
  2. హెచ్‌సీఏ నిధులు, అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు 
  3. సీఐడీకి ఆధారాలు సమర్పించిన టీసీఏ ప్రతినిధులు

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మో హన్ రావుపై అపెక్స్ కౌన్సిల్ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనతో పాటు హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావులను కూడా సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ ముగ్గురిపై హెచ్‌సీఏ నిధులు, అధికార దుర్విని యోగం ఆరోపణలు రావడంతో పాటు సీఐడీ, ఈడీ దర్యాప్తు కూడా జరుగుతున్నందున సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసిన ట్టు అపెక్స్ కౌన్సిల్ పేర్కొంది.

మరోవైపు బీసీసీఐ నుంచి తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కోసం విడుదలయ్యే నిధులను జిల్లాల పేరిట హెచ్‌సీఏ దుర్వినియోగం చేస్తుందని పలు జిల్లాల టీసీఏ కార్యదర్శులు గురువారం  సీఐడీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ)లోని వివిధ జిల్లాల కార్యదర్శులు ఈ మేరకు గురువారం సీఐడీని కలిసి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

గత 10 సంవత్సరాలుగా హెచ్‌సీఏ జిల్లాల పేరుతో ఖాతాల్లో నమోదు చేసిన సుమారు రూ. 12 కోట్ల నిధుల దుర్వినియోగానికి సంబంధించి పలు కీలక ఆధారాలను సీఐడీ అధికారులకు సమర్పించారు.

ఈ సందర్భంగా గత పది సంవ త్సరాల హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లు, జిల్లా కార్యదర్శులు చేకూరి వెంకట్(ఖమ్మం), చాగంటి శ్రీనివాస్ (వరంగల్), కోదాటి ప్రదీప్ (ఆదిలాబాద్), ఎం. రాజశేఖర్ (మహబూబ్‌న గర్), ఏ. రాజేందర్ రెడ్డి (మెదక్), వెంకట్ రెడ్డి (నిజామాబాద్), ఆగం రావు (కరీంనగర్), సయ్యద్ అమీనుద్దీన్ (నల్లగొండ)లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేయాలని కోరారు. తద్వారా తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి అవరోధం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.