calender_icon.png 3 August, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎట్టకేలకు చిక్కిన చిరుతపులి

01-08-2025 01:41:31 AM

మణికొండ, జూలై 31 : మంచిరేవుల ఫారెస్ట్  ట్రెక్ పార్కులో గత కొన్ని రోజులుగా భయాందోళనలు సృష్టించిన చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. 25 రోజులుగా నార్సింగి పరిధిలోని వ్యాస్ నగర్, గ్రే హౌండ్స్, గోల్కొండ ప్రాంతాల్లో సంచరించిన చిరుత కోసం అధికారులు 14 ట్రాప్ కెమెరాలు, 3 బోన్లు ఏర్పాటు చేశారు. గో ల్కొండ వద్ద చిరుత రోడ్డు దాటుతున్న దృ శ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గురువారం అధికారులు ట్రెక్ పార్కు గేటు వద్ద పకడ్బందీగా చిరుతను బం ధించారు. అనంతరం చిరుతపులిని జూపార్కుకు తరలించారు.