calender_icon.png 28 December, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య సూత్రాలతోనే ఆరోగ్యం

28-12-2025 12:00:00 AM

  1. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి

ఇషా మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మలక్‌పేట్, డిసెంబర్ 27 (విజయక్రాంతి) : మారుతున్న మనుషుల జీవన శైలి, వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనేక మార్పులతో కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నా రు. శనివారం ముసరాంబాగ్ డివిజన్‌లో ఇషా మెడి కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మన ఆరోగ్య పరిరక్షణకు మనమే వైద్యులమని, ఆరోగ్య సూత్రాలను పాటి స్తూ.

ఆరోగ్యవంతంగా ఉండేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, , ఇక్కడికి వచ్చే రోగులు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్లే విధంగా ఈషా మెడి కేర్ హాస్పిటల్ యాజమాన్యం మెరుగైన వైద్య చికిత్సను అందిం చాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ పూర్ణచంద్రరావు, డైరెక్టర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.