28-12-2025 12:00:00 AM
కందుకూర్ క్రాస్ రోడ్డు హోండా షోరూమ్ పక్కన గదిపై దాడి
కందుకూరు, డిసెంబర్ 27(విజయ క్రాంతి): కందుకూర్ క్రాస్ రోడ్డు హోండా షోరూమ్ పక్కన గదిపై దాడిచేసిన నలుగురి వ్యక్తులు శనివారం కందుకూర్ పోలీసుల అదుపులో తీసుకున్నారు. కందుకూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రం, భగల్పూర్ జిల్లా, పిర్పింటి ప్రాంతానికి చెందిన మహ్మద్ చోటు (20) షేక్ రాజు (49), మహ్మద్ అస్లాం (36), మహ్మద్ రహమాన్ (20) ఈ నలుగరు ఒకే ప్రాంతానికి చెందివారు. విశ్వసనీయ సమాచారం మేర కు సర్చ్ నిర్వహించి ఆ నలుగురి నిందితులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరందరు పాత నేరస్తులు గుర్తించారు. కందుకూర్ క్రాస్ రోడ్డు హోండా షోరూమ్ పక్కన గదిపై గతంలో దాడి చేశారు. వీరి వద్ద నుంచి 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కందుకూర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రజలకు తెలిస్తే వెంటనే సమాచారం ఇచ్చి సహకారించాలని కందుకూర్ పోలీసులు ప్రజలను కోరారు.