calender_icon.png 15 September, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యం మీ చేతుల్లోనే!

30-10-2024 12:00:00 AM

చేతులు కడుక్కోవడం అందరికీ తెలిసిన విషయం. ఇందులో కొత్తగా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలేమీ లేవు. రెండుమూడేళ్ల కిందట కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ల కంటే ముందుగా అందరి ప్రాణాలు రక్షించింది ఈ చేతులు కడుక్కోవడమే. చేతులు కడుక్కోవడంలో చేసే కొన్ని పొరబాట్లను సరిదిద్దుకోవడమెలాగో చూద్దాం.

* హానికరమైన మురికి అంతా తొలగిపోవాలంటే సబ్బును వాడాల్సిందే. 

* సబ్బు రాసుకన్న చేతివేళ్లను శుభ్రంగా కనీసం 20 సెకన్ల పాటు రుద్దుకుంటూ కడగాలి. చేతుల్ని శుభ్రం చేసుకున్న వెంటనే.. ఆ తడిచేతులతోనే పని చేయడం మంచిది కాదు. తడి చేతులు పొడిగా అయ్యేవరకు ఆగి అప్పుడే తినడం లేదా ఏదైనా పనిచేయడం మొదలు పెట్టాలి. 

* ఒకసారి చేతులు శుభ్రంగా కడిగాక తినడం లేదా ఏదైనా పనిచేయడం పూర్తయ్యే వరకు మురికిగా ఉండే ఉపరితలాలను తాకడం వంటిది చేయకూడదు. 

* కొందరు చేతులను హడవిడిగా కడిగేసుకుంటారు.. అలా చేయవద్దు. రెండు వేళ్లకూ మధ్య నుండే చోట్ల లేదా గోర్ల చివర్లను శుభ్రం చేసుకోరు. చేతులు కడుక్కోవడం లేదా శుభ్రం చేసుకోవడం అంటే చేతి వేళ్ల మధ్యభాగాన్ని, గోర్లను కడుక్కోవాలి.