calender_icon.png 15 September, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్..

30-10-2024 12:00:00 AM

ముప్పు వేలకు పైగా శస్త్ర చికిత్సలు చేసిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు 2000 సంవత్సరంలో నెల్లూరులో కిమ్స్ (కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) హాస్పిటల్‌ను స్థాపించారు. అనతి కాలంలోనే అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు కిమ్స్ ఆస్పత్రులు విస్తరించాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రి ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంది. 

అనంతరం 2022లో రాజమండ్రిలో మరో బ్రాంచిని ప్రారంభించారు. 2004లో కిమ్స్ గ్రూప్ ప్రధాన ఆసుపత్రిని సికింద్రాబాద్‌లో నెలకొల్పారు. ఇది ప్రస్తుతం వెయ్యి పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని అనేక ఇతర నగరాలకు విస్తరించింది.

ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రా, తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, నాగ్‌పూర్, కొండాపూర్, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు కేంద్రాల్లో కిమ్స్ ఆస్పత్రులు వైద్య సేవలందిస్తున్నాయి. అన్ని ఆస్పత్రుల్లో కలిపి నాలుగువేల పడకలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ భాస్కర్‌రావు కుమారుడు అభినయ్ బొల్లినేని ప్రస్తుతం కిమ్స్ సీఈవోగా ఉన్నారు. 

కొండాపూర్‌లో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్..

కొండాపూర్‌లో కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఇందులో కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, అనస్థీషియాలజీ, ఎండోక్రినాలజీ, డయాబెటాలజీ, న్యూ రోలాజికల్ సైన్సెస్ తదితర వైద్య సేవలను అందిస్తున్నారు. 

అవయవ మార్పిడికి అనువైన చోటు

కిమ్స్ హాస్పిటల్ అవయవ మార్పిడికి కావాల్సిన సాంకేతికతను కలిగి ఉంది. 2019లో కిమ్స్ సికింద్రాబాద్‌లో 1000 కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగాయి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ వైద్యులు ఒక కోవిడ్ రోగికి డబుల్ ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

కిమ్స్ గుండె, ఊపిరితిత్తుల బృందం 2020 సెప్టెంబర్, 2021 ఏప్రిల్  మధ్య 12 కోవిడ్ డబుల్ ఊపిరితిత్తుల మార్పిడి ప్రక్రియలను నిర్వహించింది. కోవిడ్ డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ల విషయానికొస్తే గత ఎనిమిది నెలల్లో ఆసియాలోని ఒకే హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్‌లో చేసిన అత్యధిక ప్రక్రియలు ఇదే. 

రోబోటిక్ సర్జరీ..

2017లో కార్డియాలజీ విభాగం 13వ వార్షిక కార్డియాలజీ నవీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. 2019లో ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా ఆర్థోపెడిక్ సర్జన్‌ల మోకాలి మార్పిడిపై ఒక కోర్సును నిర్వహించింది. ఆసుపత్రి 2019లో లూపస్ అవేర్‌నెస్ ర్యాంప్ వాక్, డీప్ వీన్ థ్రాంబోసిస్ అవేర్‌నెస్ వాక్ కూడా నిర్వహించింది. 2019లో పీడియాట్రిక్స్‌లో ఎముక మజ్జ మార్పిడిపై ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు. 

అవార్డు సంవత్సరం వర్గం 

టైమ్స్ హెల్త్‌కేర్ అచీవర్స్ అవార్డు 2019-20 ఆర్థోపెడిక్స్‌లో బెస్ట్ హాస్పిటల్స్

టైమ్స్ హెల్త్‌కేర్ అచీవర్స్ అవార్డు 2019-20 సర్జికల్ ఆంకాలజీలో బెస్ట్ హాస్పిటల్స్

నేషనల్ క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డు 2019 తెలంగాణలో అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 

సీసీఎస్‌డీ అవార్డు 2018 సెంట్రల్ స్టెరైల్ సప్లు డిపార్ట్‌మెంట్ ప్రాక్టీసెస్‌లో శ్రేష్ఠత

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ 

ప్రొవైడర్స్ ఇండియా అవార్డు 2017 పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్ 

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా లైఫ్ స్టుల్

హాస్పిటల్స్ అండ్ క్లినిక్ ర్యాంకింగ్ సర్వే 2017 డయాబెటాలజీ, డెంటిస్ట్రీ, బెరియాట్రిక్స్,ఆర్థోపెడిక్స్‌లో దక్షిణ 

ప్రాంతంలోని టాప్ 10లో స్థానం పొందింది. 

ది వీక్ బెస్ట్ హాస్పిటల్ సర్వే 2016 హైదరాబాద్‌లోని రెండవ ఉత్తమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

ఇండో గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్, ఎక్స్‌పో 2015 బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్