calender_icon.png 9 November, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందిని తొక్కడం మాట తప్పడం రేవంత్ నైజం

09-11-2025 01:33:58 AM

  1. భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ దాడులు..
  2. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా
  3. ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఊకదంపుడు ఉపన్యాసమే
  4. దొంగే దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు 
  5. కిషన్ రెడ్డితో రేవంత్‌రెడ్డిది ఫెవికాల్ బంధం
  6. బీజేపీతో అంటకాగింది, చీకటి ఒప్పందాలు చేసుకున్నది రేవంత్‌రెడ్డి
  7. రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పడానికి అది నోరా.. మోరా
  8. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తాకి కూలినట్టు రేవంత్‌రెడ్డి తీరు
  9. మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి) : మందిని తొక్కడం మాట తప్పడం రేవంత్‌రెడ్డి నైజమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా సీఎం రేవంత్‌రెడ్డి చేయరని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమా వేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం గంటన్నర ప్రెస్ మీట్ చూసినవారికి రేవంత్ రెడ్డి మానసిక స్థితిపై సందేహం కలుగుతుందని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫలించకపోవడంతో ఆ ఫ్రస్టేషన్‌లో గంటన్నరసేపు అడ్డమైన చెత్త వాగాడు వాగారని ఎద్దేవా చేశారు.

ఈ ప్రభు త్వం నడపడం తమకు చేతకావడం లేదని సీఎం మాటల్లో తేలిపోయిం దని, రేవంత్ రెడ్డి తన అసమర్థతను చెప్పకనే చెప్పుకున్నారని తెలిపారు. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో 2004 నుంచి 2014 వరకు చేసింది చూసి ఓటు వేయాలని అడిగారని ఎద్దేవా చేశారు. ఆనాడు టీడీపీలో ఉండి.. వైఎస్సార్ పావురాల గుట్టలో పావురం అయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వ జలయజ్ఞాన్ని ధనయజ్ఞమని అన్నది రేవంత్‌రెడ్డి కాదా అని ప్రశ్నించా రు.

రాజశేఖర్‌రెడ్డి క్విడ్ ప్రోకో కింద రూ. లక్ష కోట్ల అవినీతి చేశారని ఆరోపించింది నిజం కాదా అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో తన తండ్రి చనిపోతే దహన సంస్కారా ల అనంతరం స్నానానికి నీళ్లు లేని పరిస్థితి ఉండేదని రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటల కరెంటు ఇచ్చారని, తెలంగాణకు 24 గంటల కరెంటు ఇచ్చిందే కేసీఆర్ అని స్పష్టం చేశారు.

నాడు కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య లు తప్పు అని క్షమాపణ చెప్పి గత కాంగ్రెస్ పాలన చూసి ఓటేయాలని అడగాలని సూచించారు. రేవంత్ రెడ్డి తినే కంచంలో ఊంచే రకమని విమర్శించారు. కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయంలో కూర్చునేది రేవంత్‌రెడ్డి కాదా, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ ద్వారా మూసీకి తెస్తానని చెప్పింది మీరు కాదా అని ప్రశ్నించారు.

అప్పులపై పూటకో మాట, చిల్లర మాటలు తప్ప రేవంత్ రెడ్డి చెప్పేది ఏం లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ టాక్స్ ఓన్ రెవెన్యూ ఆవరేజ్ గ్రోత్ రేట్ 15 శాతం కాగా, సెప్టెంబర్ 2025లో కాగ్ ఇచ్చిన రిపోర్ట్‌లో జీఎస్టీ వృద్ధిరేటులో తెలంగాణ సాధించిన వృద్ధిరేటు -- 5 శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2023లో + 33 తో తెలం గాణ వృద్ధిరేటు దేశంలోనే మొదటి స్థానం లో నిలువగా, సెప్టెంబర్ 2024లో +1 తెలంగాణ వృద్ధిరేటు 1 శాతంతో దేశం లో చివరి స్థానంలో తెలంగాణ ఉందని వివరించారు.

రేవంత్ రెడ్డి వసూళ్ల వల్ల, కమీషన్ల వల్ల జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం, రోడ్ టాక్స్ తగ్గిందని, అందుకే తెలంగాణ రాష్ర్టం వృద్ధిలో తిరోగమనం పడుతుందని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ర్ట తలసరి ఆదాయం 3,47,000కు పెరిగిందని, భారతదేశంలో అత్యధిక  తలసరి ఆదాయం ఉన్న అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌పై కేసీఆర్ ముద్రను చెరపడం ఎవరి తరం కాదన్నారు. 

పనివంతుడు పందిరేస్తే కుక్క తోక తాకి కూలింది అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. గాలి మాటలు తప్ప ఆరు గ్యారెంటీల అమలు గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడరని ఎద్దేవా చేశారు. పేద ప్రజల కన్నీళ్లు తుడిచే ఒక్క ప్రణాళికైనా ఈ ప్రభుత్వానికి ఉందా, కామారెడ్డిలో వరద బాధితులకు ఒక రూపా యి అయినా విడుదల చేశారా, వరదల్లో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అం దించారా అని ప్రశ్నించారు.

ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు అడిగినందుకు ప్రైవేట్ కాలేజీలపై దాడులు చేస్తారా అని నిలదీశారు. రూ. 3,600 కోట్ల బకాయిలు  హర్యానా, మహారాష్ర్ట, బీహార్ ఎన్నికల ముందు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులను ఈ ప్రభుత్వం విడుదల చేసిందని, పిల్లల చదువులు ముఖ్య మా? లేక కాంట్రాక్టర్ల కమీషన్లు ముఖ్యమా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్న ఒకే ఒక్క రాష్ర్టం తెలంగాణ అని, ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి భయపెడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తీరు దొంగే దొంగ అన్నట్టుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధమన్నారు. ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉంటే ఎందుకు విచారణ జరగడం లేదన్నారు. 

భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ దాడులు

బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయని, ఈ విషయం ఎందుకు బయటకు రాలేదని, గుర్గావ్‌లోని భట్టి విక్రమార్క అత్తగారింట్లో ఐటీ రైడ్ చేసి కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, చిప్ లు అన్ని తీసుకెళ్లినా గప్‌చుప్‌గా ఉన్నారని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి ఇంటి మీద ఈడీ రైడులు జరిగినా ఎందుకు బయటకు రాలేదని, బీజేపీకి, కాంగ్రెస్‌కి మధ్యలో ఉన్న ఒప్పం దం ఏమిటని ప్రశ్నించారు.

బీజేపీతో అంటకాగింది, బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసు కున్నది రేవంత్‌రెడ్డే అని స్పష్టం చేశారు. 2023లో రెండు కోట్ల 73 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరిగిందని, మంత్రమేస్తే ఇంత దిగుబడి రాలేదని, పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించి, 24 గంటల కరెంట్ తెచ్చి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీసి పంటను పెంచామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భా గమైన పంప్ హౌస్‌లు, రిజర్వాయర్లు, కెనాళ్లు, టన్నెళ్లు రేవంత్‌రెడ్డికి కనిపించడం లేదా అని నిలదీశారు.

అంబేద్కర్ స్ఫూర్తి తో నిర్మించిన సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని, అందుకే సెక్రటేరియట్‌కు రేవంత్‌రెడ్డి రావడం లేదన్నారు. రేవంత్‌రెడ్డికి తెలంగాణ సోయిలేదు, తెలంగాణ ఉద్య మం గురించి తెల్వదన్నారు. తెలంగాణ ప్రతిష్ట పెరిగే విధంగా పరిపాలన సౌధా న్ని నిర్మించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమని చెప్పారు. 10 శాతం, 20 శాతం కమీషన్ల కోసం పైరవీకారులు, బ్రోకర్లు సెక్రటేరియట్‌లో నిండిపోయారన్నారు.

పీజేఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని, పీజేఆర్‌ను మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైంది కాంగ్రెస్ పార్టే అన్నారు. తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్తున్న రేవంత్‌రెడ్డిది నోరా? మో రా అని ఎద్దేవా చేశారు. 2024- 25లో రూ. 13,700 కోట్లు, 2025- 26లో రూ. 6,472 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, రా ష్ర్ట ప్రభుత్వ ఆన్‌లైన్ వెబ్‌సైట్ టీఎస్‌ఐపాస్‌లో వివరాలు ఉన్నా యని వెల్లడించారు.

నప్పతట్ల ముఖ్యమంత్రి అయితే రాష్ర్టం ఇలాగే ఉంటుంద ని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ చేసిన మోసం జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైందని, జూబ్లీహిల్స్ ఓటర్లు లైన్లు కట్టి పొద్దున్నే పోయి ఓటేయాలని డిసైడ్ అ యిందన్నారు. చీరలు, సారెలు పంచినా, పైసలు పంచినా నడువవు అన్నారు.

లేడీకి, రౌడీకి మధ్య పోటీ

  1. ఎదురీతకు లేడీ నిలుచుంటే అటువైపు రౌడీ నిలుచున్నాడు
  2. ఎవరిని గెలిపించాలో ఆలోచించండి
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఒక లేడీకి, ఒక రౌడీకి మధ్య జరుగుతున్న పోటీ అని, నియోజకవర్గ ప్రజలు ఎవరిని గెలిపించాలో విజ్ఞతతో ఆలోచించాలని మాజీ మం త్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అరాచక, బుల్డోజర్ పాలనకు ఈ ఎన్నికతో చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శనివారం షేక్‌పేటలోని అంబేద్కర్ నగర్‌లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మీరందరూ ఎంతో ఇష్టపడి గెలిపించుకున్న మీ ఎమ్మెల్యే గోపీనాథ్ అనారోగ్యంతో అకాల మరణం చెందడం దురదృష్టకరం. దిక్కులేని ఆ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలిచింది.

ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకే మాగంటి సతీమణి సునీతమ్మకు టికెట్ ఇచ్చాం. కానీ, భర్తను కోల్పో యి దుఃఖంలో ఉన్న ఒక ఆడబిడ్డను కాంగ్రె స్ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అవహేళన చేస్తున్నారు. ఈ అహం కారానికి మీ ఓటుతో మీరు బుద్ధి చెప్పాలి” అని అన్నారు.

బుల్డోజర్‌కు అడ్డంగా నేనుంటా

హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. అంబేద్కర్ నగర్‌లో కూడా హైడ్రా నోటీసులు ఇచ్చారని, నోటీసులు ఇచ్చాక కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ ఇల్లు కూలగొట్టడానికి మీరే అనుమతి ఇచ్చారని రేవంత్‌రెడ్డి అనుకుంటాడని పేర్కొన్నారు. “నేను మీకు మాటిస్తున్నాను, సునీతమ్మను గెలిపించండి. ఏ బుల్డోజర్ వస్తుందో నేను చూస్తా. ఒక్క ఫోన్ కొడితే పావుగంటలో వచ్చి ఆ బుల్డోజర్‌కు అడ్డంగా నేను నిలబడతా” అని అని భరోసా ఇచ్చారు.

ఈ ఉపఎన్నిక తీర్పు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రభావం చూపుతుందని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓటుకు రూ.5,000 ఇచ్చి మోసం చేస్తున్నారని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రెండేళ్లకు రూ.60 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ముస్లింలపై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఓటుతో సమాధానం చెప్పాలని హరీశ్‌రావు కోరారు.