09-11-2025 01:27:44 AM
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆరే బ్యాడ్ బ్రదర్స్ అని, మూడో బ్యాడ్ బ్రదర్ అసదుద్దీన్ ఓవైసీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎవరు ఎవరికి బ్రదర్స్? ఎవరు ఎవరిని కాపాడుతున్నారు? కేసీఆర్‌ను కాపాడుతోంది కాంగ్రెస్ కాదా? రాహుల్ గాంధీకి భయపడి ఎందుకు చర్యలకు వెనకాడుతున్నావని ఆయన రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ప్రభుత్వమన్నారు.
అప్పటి బీఆర్‌ఎస్ కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వమని కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్ తనకు అవసరంలేదని, మజ్లిస్ పార్టీతో తప్ప అన్ని పార్టీలలో రేవంత్‌రెడ్డి పనిచేశారని, కానీ తన చివరి శ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని పేర్కొన్నారు. ‘ఇష్టం ఉంటే రేవంత్ టోపీ పెట్టుకో, ప్రజలకు టోపీ పెట్టకు’ అని కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందించారు.
రేవంత్‌రెడ్డి, కేసీఆర్ తెలంగాణకు శాపమని అన్నారు. గతంలో కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వం, ఇప్పుడు సోనియా ఫ్యామిలీ ప్రైవే ట్ లిమిటెడ్ ప్రభుత్వం ఉందన్నారు. తెరచాటు రాజకీయాలు చేయడంలో కేసీఆర్-, రేవంత్ దిట్ట అన్నారు. తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్ అని, అనేక ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడ్డ బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్ అని విమర్శించారు.
వారు నిరుద్యోగులను, మహిళలను మోసం చేశారని, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసే బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆరే అని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీని పెంచి పోషించి, వారి కనుసైగల్లో, వారి ఆలోచనలను పాటించే బ్యాడ్ బ్రదర్స్ వారే అన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ పాలించినట్టే, రాష్ట్రాన్ని మద్యంతో నడిపిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని, మహిళలకు తులం బంగారం, స్కూటర్, పొదుపు సంఘాలకు వడ్డీ అని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్ అని పేర్కొన్నారు.
మజ్లిస్ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వంగి వంగి సలాం కొడుతున్నాయని విమర్శించారు. రేవంత్‌లా పార్టీలు మార్చే బుద్ధి మాకు లేదని, మంత్రులు పాలనను వదిలేసి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తిరుగుతూ డబ్బులు పంచుతున్నారని, అంగట్లో సరుకు కొన్నట్లుగా ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
ఓడిపోతామనే ఫస్ట్రేషన్‌తోనే...
కాంగ్రెస్ ఓడిపోతుందనే ఫస్ట్రేషన్‌తో ముఖ్యమంత్రి సోయి తప్పి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్లేటప్పుడు, తాను ఏమి చేశాడో వివరించి, ఆ తర్వాత ప్రత్యర్థిని విమర్శిస్తూ ఓట్లు అడగాలని సవా ల్ విసిరారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించే వ్యూహంలో భాగంగానే తమపై, ప్రధానమంత్రిపై, తమ పార్టీపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోయాయని దిగజారుడు రాజకీయాలు రేవంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజే పీ అంటే ఏమిటో, కిషన్‌రెడ్డి అంటే ఏమిటో దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలుసన్నా రు. గత ఎన్నికల్లో ఫేక్ వీడియోలు తయారుచేసి ప్రచారం చేసిన పార్టీ కాంగ్రెస్, -బీఆర్ ఎస్, జూబ్లీహిల్స్‌లో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. లక్ష కోట్ల అవినీతి డబ్బులు కక్కిస్తానన్న రాహుల్ గాంధీ లక్ష రూపాయలను కూడా బయటకు తీశాడా? అని ప్రశ్నించారు.
అసలు ఆట మొదలు కాలేదు..
అసలు ఆట ఇంకా మొదలు కాలేదని, తెలంగాణలో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామని, మీరు చేసిన పనులు ఏంటో తెలంగా ణ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఆట మొదలుపెట్టినప్పుడు తెలుస్తుంది మా సత్తా ఎంటోనన్నా రు. రానున్న రోజుల్లో మా ఆట మొదలు పెడ తాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల కింద ఉన్న భూమి కదులుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళనలో అధికార, మజ్లిస్ పార్టీ నేతల భవనాల జోలికి వెళ్లరు కానీ, పేద ప్రజల ఇళ్లను మాత్రం కూలగొడతారన్నారు. ‘చైనా సరిహద్దులో చైనా సైనికులను భారత సైనికులు కొట్టారని, సర్జికల్ స్ట్రుక్స్ జరిగాయా?’ అంటూ, పాక్ సైనికులను పొగుడుతూ సీఎం మాట్లాడారని, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ కాంగ్రెస్ అన్నారు.
ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం...
ఢిల్లీ స్థాయిలో బీఆర్‌ఎస్, -కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని, ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు... కేటీఆర్ సోష ల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌ను కలుపుకొ ని పోరాటం చేయాలన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యముంటే, ఏ విషయంలో బీజేపీ-, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయో చూపించాలని ఆయన సవా ల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? ధాన్యం కొనుగోళ్ల కేసు ఏమైంది? భూముల కొనుగో ళ్ల కేసు ఏమైంది? అని నిలదీశారు.
‘అస లు నీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మ కం ఉందా? మీ పార్టీలో నీ మీద నమ్మ కం ఉందా? మీ మంత్రులు నిన్ను నమ్ముతున్నారా? మీ మంత్రులు ఏ మాట్లాడుకుంటున్నారో వింటున్నావా? వాళ్లు కార్యకర్తలతో ఏం చెబుతున్నారో నీకు తెలుసా?’ అని ప్రశ్నించారు. కాం ట్రాక్టుల దగ్గర, రియల్ ఎస్టేట్ పరిశ్రమ ల దగ్గర వేలాది రూపాయలు వసూలు చేసింది నిజం కాదా? బీహార్ ఎన్నికలకు ఆ డబ్బు పంపింది నిజం కాదా?, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయ డానికి నీకు మనసు రాదు, ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్‌లో పడ్డాయన్నారు.
అసలు కేంద్రం ట్రిపుల్ ఆర్‌కు ఆమోదం తెలిపినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు’? అని సీఎంను ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, దీనిపై చర్చించడానికి రేవంత్ రెడ్డి, కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు.