calender_icon.png 13 November, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహాలతో బాలికలకు అనారోగ్య సమస్యలు..

13-11-2025 06:16:07 PM

డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ యశోద...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): బాల్య వివాహాలు చేయడంతో బాలికల్లో అనేక ఆరోగ్య సమస్యలు నెలకొంటాయని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ యశోద తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమం భాగంగా ప్రత్యేక బాల్య వివాహ అవగాహన సదస్సును స్థానిక సరస్వతి నగర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల గురువారం నిర్వహించారు. విద్యార్థులకు బాల్యవివాహ నిషేధచట్టం, బాల్య వివాహం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక ప్రభావాలపై అవగాహన కల్పించారు.

 తదనంతరం పాఠశాలలో కిశోరి గ్రూపులు ఏర్పాటు చేసి, విద్యార్థులకు బాల్య వివాహ చట్టం, POCSO చట్టం, అలాగే సేఫ్ టచ్ - అన్‌సేఫ్ టచ్ అంశాలపై వివరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం ప్రతినిధి లావణ్య, సఖి కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలు, హెల్ప్‌లైన్ నంబర్ల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, సఖి సిబ్బంది సంఘమిత్ర, నాగమణి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు  పాల్గొన్నారు.