calender_icon.png 13 November, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించండి

13-11-2025 07:33:54 PM

రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏకశిలా జయశంకర్ పార్కు వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంను రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, పూర్వ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు సంఘం ప్రధాన కార్యదర్శి బాబూరావు ప్రారంబించారు. అనంతరం రాష్ట్ర కో కన్వీనర్, జిల్లా అధ్యక్షుడు శ్రీదర్ల ధర్మేంద్ర మాట్లాడుతూ మార్చి 2024 నుండి రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గతంలో కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రములు కూడా సమర్పించడమైనది.

కానీ ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి బకాయిలు అందక రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలు వేదనా భరితంగా ఉన్నాయని, చాలామంది మానసిక వేదనతో చనిపోతున్నారనీ వేడుకొనగా, నాయిని రాజేందర్ రెడ్డి  స్పందించి ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమానికి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనా చారి, మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు సంఘీ భావం ప్రకటించారు.

ఈ కార్యక్రమములో భారత్ బచావో నాయకులు యం.వెంగళ్ రెడ్డి, సాధన కమిటీ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కందుకూరి దేవదాసు,మహబూబ్ అలీ, జాయింట్ సెక్రెటరీ అబ్దుల్ గఫార్,యుటిఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్, పి.అశోక్ కుమార్,యం. లక్ష్మయ్య, ఈ. ఇంద్రసేనారెడ్డి,వెంకటయ్య, సాంబయ్య, పి.అశోక్ ,రఘువీర్, దుర్గం రవి,మిరియాల రమేష్, కె. శ్రీనివాస్, పి.రాజి రెడ్డి,పి.సంజీవ రెడ్డి, సారయ్య, రాజేందర్, కే.శ్యామ్ రావు, జే.మహేందర్ రావు, ఎం.సంజీవరెడ్డి, సాంబయ్య, శ్యాంసుందర్, డాక్టర్ బి. కృష్ణమూర్తి, సి.హెచ్.సంజీవ రావు,వాసుదేవ్, వి.కొమురెల్లి, వసుమతి, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.