13-11-2025 07:24:15 PM
దాడుల సంప్రదాయం మంచిది కాదన్నా మాజీ జడ్పీటీసీ...
తలమడుగు (విజయక్రాంతి): నిన్న బోథ్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మీ చెక్ ల పంపకంలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముందర ప్రొటాకల్ గురించి అడిగినందుకు ఆత్మ చైర్మన్ గొర్ల రాజు, పసుల చంటిపై బీఆర్ఎస్ నాయకులు దాడి చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ... బోథ్ నియోజకవర్గంలో దాడుల సంప్రదాయాన్ని ప్రోత్సహించడం సరి అయిన పద్ధతి కాదని అన్నారు. అదేవిధంగా అధికారులు కూడా ముఖ్యమంత్రి సందేశాన్ని చదవకుండానే చెక్కులు పంపడం సరైన పద్ధతి కాదని, పదవిలో ఉన్న వారిని స్టేజ్ పై పిలిచి కార్యక్రమం జరపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్. సీనియర్ నాయకులు ప్రకాష్ రావు, వెంకన్న యాదవ్, గంగారం, లోక ప్రవీణ్ రెడ్డి, గాజుల సాంబశివ్, కుమ్మరి నడిపెన్న, విలాస్ యాదవ్, తదితరులు ఉన్నారు.