13-11-2025 07:37:59 PM
ముకరంపుర (విజయక్రాంతి): నగరంలోని ఆర్విన్ ట్రీ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రీ ప్రైమరీ చిన్నారులకు ఫ్యాన్సీ కాస్ట్యూమ్ కార్నివాల్ నిర్వహించారు. కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ బి రమణ రావు, కరస్పాండెంట్ విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రీ ప్రైమరీ చిన్నారులు విభిన్న వేషధారణలు వేదికపై ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. పాఠశాల చైర్మన్ బీ రమణారావు మాట్లాడుతూ సమాజంలోని అన్ని రంగాల వారు ఒకే వేదికపై కనిపించేలా ఫ్యాన్సీ డ్రెస్ కార్నివాల్ ఉందని, చిన్నారులకు అందరి పట్ల అవగాహన కలుగుతుందని తెలిపారు.