13-11-2025 07:40:35 PM
కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసినా డిఎంహెచ్ఓ..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి ఇన్చార్జి వైద్యశాఖ అధికారిగా డాక్టర్. ఎం విద్యారాణి వల్కర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య సేవలు మెరుగుదల, వైద్య సిబ్బంది మధ్య సమన్వయం, మాత శిశు ఆరోగ్య కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాను కృషి చేస్తానని డాక్టర్ విద్యారాణి వల్కర్ తెలిపారు.