13-11-2025 07:35:53 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్ తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలు కార్యాలయ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కార్యాలయ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి, నిర్ణిత గడువులోగా పనులు పూర్తి చేసి, ప్రజలకు సేవలు అందించడానికి కార్యాలయాన్ని అందుబాటులోకి తేవాలని అన్నారు.
నూతన కార్యాలయ భవన నిర్మాణం పూర్తయ్యేలోపు అధికారులు విధులు నిర్వహించడానికి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసిల్దార్ సుజాత, మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, ఈఈ పిఆర్ చందు జాదవ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.