13-11-2025 07:29:14 PM
చిట్యాల (విజయక్రాంతి): తమ ఊరి చెరువును వర్షం నీటి ద్వారా, కాలువల ద్వారా నిండడానికి సహకరించిన ముఖ్య నాయకుల చిత్రపటానికి రైతులు, నాయకులు గురువారం క్షీరాభిషేకం చేశారు. చిట్యాల మండలం ఎలికట్ట గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలతో పాటు, పిల్లాయి పల్లి కాలువ ద్వారా నీటి ప్రవాహం రావడంతో గ్రామ చెరువు పూర్తిగా నిండి చెరువు జలకళను సంతరించుకోవడంతో గ్రామ ప్రజల్లో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు కలిసి రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యుడు వేముల వీరేశం ల చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
నకిరేకల్ ఎమ్మెల్యే చేపట్టిన పిల్లాయి పల్లి కాలువ పునరుద్ధరణ, చెరువుల నీటి నిల్వ సామర్థ్య పెంచడం వలన చెరువు పూర్తిగా నిండి గ్రామ పరిధిలోని సుమారు 100 ఎకరాల భూభాగంలో భూగర్భ జలస్థాయి పెరగడంతో పాటు, రైతులు రెండు నుంచి మూడు వ్యవసాయ సీజన్లలో సాగునీటి సమస్యలు లేకుండా పంటలు సాగు చేయగలరని తెలిపారు. చెరువులో చేపల పెంపకానికి, మత్స్యకారులకు జీవనోపాధి కల్పించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా పాలకేంద్ర చైర్మన్ గుత్తా యాదగిరి రెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండ ఎల్లయ్య గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగార్జున యాదగిరి, మాజీ ఎంపిటిసి పోలగోని సత్తయ్య గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సాగర్ల యాదయ్య యాదవ్, పాలకైన డైరెక్టర్ జక్కలి సత్తయ్య, మాజీ వార్డ్ సభ్యులు మత్స్యగిరి, ఉయ్యాల యాదగిరి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉయ్యాల శివకుమార్ గౌడ్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉయ్యాల నవీన్ కుమార్ గౌడ్, జిల్లెల్ల నవీన్, ఉయ్యాల సుమంత్ గౌడ్, రైతులు ఓరుగంటి బిక్షమయ్య, , సాగర్ల సత్తయ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.