calender_icon.png 13 November, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ మద్దతు ధరకే పత్తి కొనుగోళ్ళు

13-11-2025 07:26:15 PM

* కాటారంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

* మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య

కాటారం (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేపడతామని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య అన్నారు. గురువారం మండలంలోని మీనాక్షి కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లు యందు సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమల మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకునే విధంగా చూసుకోవాలని సూచించారు. దళారులకు అమ్మి రైతులు ఆర్థికంగా నష్టపోవద్దని, మోసపోవద్దని అన్నారు. అలాగే తేనెటీగల పెంపకం కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చినాల బ్రహ్మారెడ్డి, మహాదేవపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పిల్లమారి రమేష్, జాటోత్ రాజారాం నాయక్, యూత్ కాంగ్రెస్ మంథని నియోజకవర్గం అధ్యక్షులు చీమల సందీప్, నాయకులు గడవేన దేవేందర్, కిషోర్, కలికోట వరప్రసాద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎండి లా షరీఫ్, సి సి ఐ అధికారి ఎలెన్ గోవన్, మిల్లు యజమానులు సిబ్బంది పాల్గొన్నారు.