12-12-2025 12:00:00 AM
పోలం సైదులు :
* ప్రభుత్వ ఆసుపత్రులైన్నప్పటికీ కొన్నింటిలో అత్యాధునిక యంత్రాలు, పరికరాలు లేకపోవడం, సిబ్బంది కొరత లేదా ఇతర కారణాల వల్ల కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి లాంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన కొన్ని నిర్దిష్ట ప్రైవేట్ ఆసుపత్రుల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఖర్చు భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ వస్తుంది.
ప్రస్తుత తరంలో మనుషులు ఎం త జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ ఎప్పుడు ఏమౌతుందనేది చెప్పడం కష్టమే. మానవుని జీవితం ఒక నీటి బుడగలా మారిపోయిందని చెప్పవచ్చు. వాతా వరణ కాలుష్యం, క్రిమి సంహారక, రసాయనిక ఎరువులు, మందులు వాడుతూ పంటలు పండించడం.. ఆరోగ్యానికి హాని కలిగించే కార్బుడ్ లాంటి పదార్థాలను ఉపయోగించి ఫలాలను తాజాగా కనిపించ డం కోసం ఫలదీకరణ చేయడం చేస్తున్నారు.
అంతేకాదు ప్రొటీన్స్, విటమిన్స్, కార్బో హైడ్రేట్స్ లేనటువంటి పోషకాహారలేమి ఆహారపదార్థాలను తీసుకోవడం వ ల్ల శరీరంలో క్రమంగా రోగనిరోధక శక్తిని కోల్పోయి భిన్నరోగాల బారిన పడుతున్నారు. మరోవైపు ధూమపానం, మద్యపా నం, గంజాయీ, డ్రగ్స్ లాంటి దురలవాట్లు, అంటు వ్యాధులు, ఆకస్మిక ప్రమా దాల వల్ల మనిషి అనారోగ్యానికి గురి కావాల్సి వస్తోంది.
వైద్య రంగంలో శాస్త్ర, సాంకేతికంగా ఎంత అభివృద్ది సాధించినప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడం తో పేదల పాలిట ఇప్పటికీ ‘అందని ద్రాక్ష లా’ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కుటుంబంలో ఎవ్వరైనా అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబం ఆర్థిక, మాన సిక, శారీరకంగా చాలా వెనుకబాటుతనానికి గురికావాల్సి వస్తుంది.
ఖర్చు ప్రభుత్వానిదే..
ప్రభుత్వ ఆసుపత్రులైన్నప్పటికీ కొన్నింటిలో అత్యాధునిక యంత్రాలు, పరికరాలు లేకపోవడం, సిబ్బంది కొరత లేదా ఇతర కారణాల వల్ల కార్పొరేట్ ఆసుపత్రిలకు వెళ్లాల్సి వస్తుంది. నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి లాంటి ప్రభుత్వ గుర్తిం పు పొందిన కొన్ని నిర్దిష్ట ప్రైవేట్ ఆసుపత్రుల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న
(బీపీఎల్) కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఖర్చు భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ వస్తుంది. అంతేకాదు అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన చికిత్సను ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ) ద్వారా అందిస్తుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన పదేళ్లపాలనలో సగటు న ఏటా రూ. 450 కోట్లు విడుదల చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండేళ్లలో రూ.1,685 కోట్లతో సగటున ఏటా రూ. 850 కోట్లు విడుదల చేసి 3.76లక్షల మందికి లబ్దిచేకూర్చడం హర్షనీయ అంశమని చెప్పవచ్చు. వీటి గురించి పేద ప్రజ లకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
ఉచిత చికిత్సలు..
ఆరోగ్యశ్రీ ద్వారా నిర్దేశించిన రోగాలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలకు చెందిన తెల్లరేషన్ కార్డుదారులకు 10 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందించబడుతుంది. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని రోగాలకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా రోగులకు చికిత్స అందిస్తారు. ఇక లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ప్రభుత్వం నుంచి ఆసుపత్రికిచ్చే హామీపత్రం. దీని ఆధారంగా రోగి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగా చికిత్స అందించడం.
ముందుగా రో గం నిర్దారణ అయ్యాక ఆసుపత్రి వర్గాలు చికిత్స నిమిత్తం అయ్యే అంచనా వ్యయా న్ని (ఎస్టిమేషన్ బిల్లు) రూపొందించి రోగుల కుటుంబ సభ్యులకు అందిస్తుంది. ఆ తర్వాత స్థానిక శాసనసభ్యులు లేదా శాసన మండలి సభ్యులు లేదా పార్లమెం ట్ సభ్యులను కలిసి వారి నుంచి ఒక సిపా ర్సు లేఖ తీసుకోని దానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు జతపరిచి ముఖ్యమంత్రి కా ర్యాలయాన్ని (సీఎంవో) సంప్రదిస్తే వారు లెటర్ ఆఫ్ క్రెడిట్ జారిచేస్తారు. దానిని ఆసుపత్రిలో ఇచ్చిన వెంటనే చికిత్సను ప్రా రంభించడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) అంటే.. డ బ్బులు ఖర్చుపెట్టి చికిత్స తీసుకున్న దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుం బాలకు చెందిన రోగులు.. వారి ఆసుపత్రి బిల్లులు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాం కు అకౌంట్, ఆధార్ కార్డులను ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయం లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి దళారుల బెడదా లేకుండా లబ్ధిదారుని పేరుతో పాటు బ్యాంకు ఖాతా నంబర్ పేరిట చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పథకాల వల్ల పేద, బడుగు బలహీనవర్గాల వారికి ప్రాణాపాయం నుంచి బయటపడటానికి దోహదపడుతుంది.
మెరుగైన వైద్య సేవలు..
మారుమూల గ్రామాల్లో నివసించే పే దవారికి ఆరోగ్య పరీక్షల నిర్వహణ, మం దుల పంపిణీని ఒక సామాజిక బాధ్యతగా ఆరోగ్య నిర్వహణ పరిశోధన సంస్థ (హెచ్‌ఎమ్‌ఆర్‌ఐ) తీసుకుంది. అందరికీ ఆరో గ్యం అన్న మహత్తర ఆశయంతో, చిత్త శుద్ధితో, అంకితభావంతో 108 సంచార వాహనాలు తమ సేవలు నిరంతరాయం గా అందిస్తే వస్తున్నాయి. సుమారు నాలు గు కోట్ల మంది గ్రామీణులను తీసుకురావాలనే లక్ష్యాన్ని హెచ్‌ఎమ్‌ఆర్‌ఐ పూర్తి స్థాయిలో సాధించింది.
హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో 475 సంచార వాహనాల ద్వారా, 22,500 సర్వీస్ పాయింట్లలో, అన్ని రోజుల్లోను నిరంతరాయంగా సేవలందించింది. ఏ మాత్రం రహదారి సౌక ర్యాలు లేని మారుమూల కుగ్రామాలకు, తండాలకు, గిరిజన ప్రాంతాలకు వాహనాలు పోయి సేవలందించాయి. అసం ఖ్యాక గ్రామీణులు ఈ సేవల ద్వారా లబ్ధిపొందారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు అత్యవసర సేవల నిమిత్తం 108, 104 సేవలను కొనసాగిస్తూ ప్రతి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయి లో సిబ్బందిని నియామకం చేస్తూ, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేట్లుగా చూడాలి. అలాగే ప్రతి నియోజకవ ర్గంలో అత్యాధునిక వసతులు కలిగి, అన్ని రకాల చికిత్సలు అందేటట్లుగా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాల్సిన అవస రం ప్రభుత్వాలపై ఉంది. వీటన్నింటిని ఇలాగే కొనసాగిస్తూ మరింత మెరుగైన వైద్యాన్ని ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9441930361