12-12-2025 12:00:00 AM
డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి :
* అయితే ఈ సమస్య కేవలం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకులందరూ ఇదే సమస్యలతో సతమతమవుతున్నారు.
తెలంగాణ ఉద్యమం, సామాజిక, రాజకీయ చరిత్రకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక బలమైన పునాదిగా నిలిచింది. ఈ నేలపై ఎన్నో ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఎంతోమంది మే ధావులు తయారయ్యారు. వేలాది కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ భవిష్యత్తును రూపుదిద్దుకునేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంతో దోహదపడింది. ఇలాంటి చారిత్రక నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయంలో గత ముప్పు ఏళ్లుగా సేవలం దిస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ బోధనా సిబ్బంది జీవితాలు స్థిరత్వం లేకుండా సాగిపోవడం విద్యా వ్యవస్థ పట్ల అధికార యంత్రాంగ నిర్లక్ష్యం స్పష్టంగా తెలియజేస్తోంది.
గొడ్డు కష్టం చేస్తున్నప్పటికీ కాంట్రా క్టు బోధనా సిబ్బందికి తక్కువ వేతనాలు ఇవ్వడం, ప్రమోషన్‌కు అవకాశాలు లేకపోయినప్పటికీ దుర్భర పరిస్థితుల్లో పనిచే స్తూ ఉన్నత విద్యా వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నారు. అయినప్పటికీ వారి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడమ నేది ఒక పరిపాలనా వైఫల్యంగా అభివర్ణించొచ్చు.
అయితే డిసెంబర్ 10న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చిన సందర్భంలో పార్ట్‌టైమ్, కాంట్రాక్టు అధ్యాపకుల్లో ఒక చిన్న వెలుగు కనిపించింది. అది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా తమ సమ స్యలను వినిపించుకునే అవకాశం రాలేదు.
ఈసారైనా వారి వేదన ముఖ్యమంత్రి చెవిలో పడుతుందని రాష్ర్టవ్యాప్తంగా ఆశించారు. కాని వేదికలో మాట్లాడిన వారిలో ఒక్కరూ కూడా కాం ట్రాక్ట్, పార్ట్‌టైమ్ అధ్యాపకుల సమస్యలను ప్రస్తావిం చకపోవడం వారిని నిరాశ నిస్ఫృహలకు గురి చేసింది. మూడు దశాబ్దాలుగా విద్యా వ్యవస్థకు ఒక బలంగా నిలుస్తూ వచ్చిన కాంట్రాక్ట్ అధ్యాపకుల గురించి సీఎం రేవంత్ సహా అధికా రులు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పొచ్చు.
సమస్యలతో సతమతం..
అయితే ఈ సమస్య కేవలం ఉస్మాని యా విశ్వవిద్యాలయానికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకులందరూ ఇదే సమస్యలతో సతమతమవుతున్నారు. స్థిరత్వం లేని జీవితం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం, తాత్కాలిక వేతనాలతో జీవ నం సాగించాల్సి రావడం వారిని మానసి క ఆందోళనలోకి నెట్టేస్తున్నది.
అయితే ఈసారి ఓయూకు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసిన తర్వాత ఈ వర్గం తమకు న్యా యం జరుగుతుందని ఆశించింది. ‘ఈసారి మా సమస్యలపై తప్పకుండా చర్చ జరుగుతుంది.. రాష్ట్ర స్థాయిలో మా సమస్యలన్నీ పరిష్కారమవుతాయి’ అని గంపెడాశతో ఎదురుచూసిన వారి ఆశ నెరవేరలేదు.
దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్య వైఖరే అన్న విమర్శలు ఉద్యో గుల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఇది వాస్తవానికి మన విద్యా వ్యవస్థలో పరిపాలకులు.. ఉద్యోగుల సమస్యలను ఎలా చూస్తున్నారనే అంశం ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఉద్యోగుల సంక్షేమం, స్థిర త్వం, వేతన సంస్కరణలు, భద్రతా హక్కు ల విషయంలో కనీసం స్పందించకపోవడాన్ని గ్రహించాల్సిన అవసరముంది.
అధికారుల నిర్లక్ష్యం..
ఉస్మానియా విశ్వవిద్యాలయ కాంట్రా క్టు అధ్యాపకులు తమ సమస్యలు ముఖ్యమంత్రి వరకు చేరకపోవడానికి ప్రధాన కారణం అక్కడి వైస్ చాన్స్‌లర్ అనుసరిస్తున్న వైఖరేనని స్పష్టంగా తెలుస్తోంది. సంస్థకు నాయకత్వం వహించే వ్యక్తి విద్యా ప్రమాణాలను పెంచడమే కాదు, ఉద్యోగు ల ఆవేదనలను అధికార వర్గాల దృష్టికి తీ సుకెళ్లడంలో బాధ్యతగా వ్యవహరించాలి.
కానీ సీఎం హాజరైన వేదికపై కాంట్రాక్ట్, పా ర్ట్‌టైమ్ అధ్యాపకుల సమస్యలపై కనీస ప్రస్తావన తేకపోవడం, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, సమస్యను పూ ర్తిగా పక్కకు నెట్టేయడం చూస్తే ఓయూ పాలనాధికారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. విద్యా సంస్థల అభివృద్ధి అనేది పూర్తిగా బోధనా సిబ్బంది నిబద్ధతపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఆ సిబ్బందికే ఇవాళ కనీస గౌరవం ఇవ్వకుండా విశ్వవిద్యాలయాలు ఇష్టారీతిన వ్యవహరిస్తుండ డం ద్రోహం కిందకే వస్తుంది.
ముప్పు సం వత్సరాలుగా ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయడం ఎంత కఠినమైన విషయం అనేది అరిగోస పడుతున్న కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ అధ్యాపకులే సవివరంగా వివరించగ లరు. తాత్కాలిక ఒప్పందాలు, తక్కువ వేతనాలు, భవిష్యత్తు భయం, కుటుంబ భా రం.. ఇలా అన్నింటిని దిగమింగుకొని ఉ న్నత విద్యా సేవ చేయడమే కాకుండా పరిశోధనలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అలాంటి సిబ్బందికి ఇప్పటికీ శాశ్వత ఉద్యోగం లేకపోవడం వివక్ష కింద లెక్కగట్టొచ్చు. విద్యను నిలబెట్టడానికి త్యా గం చేసిన వర్గానికి ప్రభుత్వం కనీస స్థిర త్వం ఇవ్వలేకపోవడం రాష్ర్ట విద్యా విధాన పతనానికి ప్రతిబింబంగా పేర్కొనవచ్చు.
ప్రత్యక్ష సమావేశాలు..
విశ్వవిద్యాలయాలు అధ్యాపకుల సమస్యలను చులకన చేయడం వల్ల ఆ ప్రభా వం యూనివర్సిటీల్లోని విద్యార్థులపై పడుతోంది. తరచూ కాంట్రాక్టు అధ్యాపకుల నిరసనలు, ధర్నాలతో బోధనలో నాణ్యత తగ్గిపోవడంతో పాటు పరిశోధన కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. ఈ వైఖరి విద్యా సంస్థల్లోనూ అసంతృప్తి పెంచుతున్నది. ఒక రాష్ర్ట భవిష్యత్తు ఉన్నత విద్యా నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి సమయంలో బోధనా సిబ్బంది సమస్యలను ఎత్తి చూడకపోవడం ప్రమాదకర పరి ణామం.
రాష్ర్టంలోని 12 విశ్వవిద్యాలయా ల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఒకే విధానంతో రక్షించే పథకం తక్షణం అమల్లోకి తీసుకురావాలి. సేవా కాలాన్ని బట్టి శాశ్వతీకరణ విధానం, ఆరోగ్య భద్రత, వేతన సవరణ, ప్రమోషన్ల వ్యవస్థ, ప్రతి విశ్వవిద్యాలయంలో పరిపాలన విధానాలను పర్యవేక్షించేందుకు రాష్ర్ట స్థాయి కమిటీ అ వసరం. విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకుల సమస్యలపై స్వ యంగా ముఖ్యమంత్రి ఆయా సంఘాల ప్రతినిధులతో ప్రత్యక్ష సమావేశం జరిపేందుకు ముందుకు వస్తే బాగుంటుందని విద్యావంతులు పేర్కొంటున్నారు.
తక్షణ చర్యలు..
భవిష్యత్తులో కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి నేరుగా జోక్యం చేసు కుని సంబంధిత విభాగాలకు స్పష్టమైన కార్యాచరణకు మార్గనిర్దేశనం చేయాలి. గతంలో కమిటీలు ఏర్పరచినా ఫలితం రాకపోవడంతో కాంట్రాక్టు అధ్యాపకుల్లో ఏర్పడిన అవిశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేయాలి. మునుప టి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఉద్యోగులు మోసపోయిన భావనలో కూరుకుపోయి ఉన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఆ పరిస్థితి రాకూడదనేది వారి ఆకాంక్ష. సీఎం రేవంత్ కాంట్రాక్ట్, పా ర్ట్‌టైమ్ అధ్యాపకుల మూడు దశాబ్దాల సే వను గౌరవిస్తూ జీవిత స్థిరత్వానికి బలమైన హామీ ఇవ్వాలి. సమస్య పరిష్కారా నికి కాలపరిమితి విధించడంతో పాటు అ ది అమలయ్యేలా స్పష్టమైన ప్రణాళిక రూ పొందించాలి. ఉద్యోగుల ప్రతినిధులతో ని ర్దిష్ట వ్యవధిలో సమీక్షా సమావేశాలు నిర్వహించే వ్యవస్థను తీసుకురావాలి.
రాష్ర్టం లోని 12 విశ్వవిద్యాలయాల్లో సమాన న్యా యం సాధించాలంటే పరిపాలనలో బాధ్యతాయుత ధోరణి అవసరం. ఉన్నత విద్యా భవిష్యత్తు బోధన సిబ్బంది భద్రతపై ఆధారపడినందున ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి. ఈసారి ఉద్యోగుల ఆశలను అడియాశలు చేయకుండా ప్రభుత్వం తమ నిబద్ధతను నిరూపించుకోవాలి. ఇది కేవలం పరిపాలనా అంశం కాదు సమాజ పట్ల ఉన్న నైతిక బాధ్యత అని గుర్తించాలి.