07-10-2025 06:07:44 PM
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తాజా మియాపూర్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. మన్ని రామ్ అనే వ్యక్తి రాజస్థాన్ నుండి హైదరాబాద్‌కి వచ్చాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని తనీఖీ చేసి విచారించగా గసగసాలు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. స్మగ్లర్ నుంచి 4.25 కిలోల గసగసాలను స్వధీనం చేసుకొన్నారు. నిందితుడు కార్పెంటర్‌గా పని చేస్తూ డ్రగ్స్ దందాకు తెరలేపిన్నట్లు పోలీసుల విచారణలో తెలింది. ఈ మేరకు గసగసాల స్మగ్లర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.