calender_icon.png 6 October, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై విచారణ

06-10-2025 06:48:06 PM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావుల పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు చేపట్టొద్దంటూ గతంలో కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది.

దీనంతటికీ కేసీఆర్ యే పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీని ఎక్కడ నిర్మించాలి, ఎంత నీరు నిల్వ చేయాలి, ఎలా నిర్వహించాలన్న విషయాలతో పాటు, ప్రాజెక్టు ఆర్థిక అంచానాలను మార్చేసింది కూడా ఆయనే అని జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఇకా ఆ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావులు పిటిషన్లుపై విచారించిన హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్ దాఖలుపై రేపు కోర్టు విచారించనుంది.