06-10-2025 06:41:51 PM
పాపన్నపేట (విజయక్రాంతి): పాపన్నపేట మండల నూతన వ్యవసాయ శాఖ అధికారిగా ప్రత్తిగుడుపు శ్రీనివాస రాజు సోమవారం ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం తేనికెళ్ల క్లస్టర్ నుంచి ఆయన ఇక్కడికి పదోన్నతిపై వచ్చారు. ఇంతకుముందు ఇక్కడ మండల వ్యవసాయ అధికారిగా పనిచేసిన పి. నాగమాధురి మెదక్ జిల్లా కార్యాలయానికి బదిలీపై వెళ్లారు.