15-10-2025 12:50:54 AM
మరిపెడ, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లో గ్రూపు - 1 లో డిఎస్పీగా పోస్టింగ్ పొందిన జాటోత్ బాలాజీ కుమారుడు జాటోత్ విజయ్ కుమార్ ని మరిపెడ మండలం బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మంగళవారం ఆర్లగడ్డ తండాలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాలు నాయక్, హరి నాయక్, టిఆర్‌ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు అజ్మీరా రెడ్డి నాయక్, రవి, గంధసిరి కృష్ణ, హరి నాయక్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.