08-08-2025 01:19:34 AM
హన్మకొండ /కె యు క్యాంపస్ ఆగస్టు 07 (విజయ క్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధినేతర మహిళా ఉద్యోగినిలు డాక్టర్ ఎస్. సుజాత,బి.కృష్ణవేణి ల ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ముందస్తు రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు వైస్ ఛాన్స్లర్ ఆచార్య కే. ప్రతాపరెడ్డి, రిజిస్టర్ ఆచార్య వి. రామచంద్రం, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విసీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తోడ్పాటు అవసరమని ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలు అవకాశాలు అందుబాటులో ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ రిజిస్టర్ ఆర్. శ్రీలతాదేవి, సూపర్డెంట్లు హేమ రాణి, నర్మదా, పద్మావతి ఇతర మహిళా సిబ్బంది పాల్గొన్నారు. వారు తమతో పనిచేసే పురుష ఉద్యోగులకు రాఖీలు కట్టి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.