06-08-2024 11:31:45 AM
హైదరాబాద్: నాగార్జునసాగర్ జాలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. అధికారులు సాగర్ 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుతం 585.40 అడుగులకు చేరుకుంది. నీటినిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 298.58 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి 3,54,831 క్యూసెక్యుల ప్రవాహం వస్తుండగా, 3,14,761 క్యూసెక్యులు వదులుతున్నారు. నాగార్జునసాగర్ జాలాశయం కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతుంది. కాగా... ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో రెండు లక్షల క్యూసెక్ల నీరు కిందకు విడుదల చేయనున్నారు.