calender_icon.png 3 August, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

06-08-2024 10:59:04 AM

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అట్టునుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టాడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యక్తి తల తెగి కారు వెనుక సీటులో పడిన వైనం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు శంషాబాద్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.