06-08-2024 11:57:22 AM
ఈ విలయాలకు కారణమేంటి ?
ఆకాశ గంగా ప్రవాహమే...!
నేడు వయనాడ్... నిన్న ఉత్తరా ఖండ్.. దేశంలోని 80 శాతం రాష్ట్రాలలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి.ప్రకృతి విపత్తుల కారణంగా వందలమంది ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. భారత్, దక్షిణ ఆసియా ప్రాంతంలో వరదలు అసాధారణమేమీ కాదు. కానీ ,అటు రుతుపవన వర్షపాతంలోనూ ఇటు ఆకస్మిక తుఫాన్ వర్షాలు కురవడం చూస్తున్నాం. వాతావరణ మార్పుల కారణంగా మార్పులొస్తుండడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షాలు కురవడం, సుదీర్ఘ కాలం వర్షాలు లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఆకాశ గంగా ప్రవాహాలే.. కారణమా ?
గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో తేమ గణనీయంగా పెరిగి 'అట్మాస్ఫియరిక్ రివర్స్' అనే భారీ నీటి ఆవిరి పాయలు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. వీటినే సాంకేతికంగా ఆకాశ గంగా ప్రవాహాలు, ఆకాశ నదులు (ఫ్లయింగ్ రివర్స్) వాతావరణ శాస్త్రవేత్తలు అని పేరు తో పిలుస్తున్నారు. ఈ ఫ్లయింగ్ రివర్ పరిమాణం సగటున 2,000 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది.
మానవ నేత్రాలకు కనిపించదు..!
1985- 2020 మధ్య రుతుపవనాల సమయంలో భారత్‌లో వచ్చిన 10 అత్యంత భారీ వరదలకు ఇలాంటి 7 ఫ్లయింగ్ రివర్స్‌కి సంబంధం ఉన్నట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ సైంటిస్టుల బృందం గుర్తించింది. మనుషుల కంటికి కనిపించని ఈ ఆకాశ గంగా ప్రవాహాలను ఇన్‌ఫ్రారెడ్, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలతో చూడొచ్చు శాటిలైట్ సహాయంతో పరిశీలించాల్సిందేనని శాస్త్రవేత్తలు పేర్కొ న్నారు