ముంచెత్తిన వాన
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మూడు రోజులుగా తెలం గాణను వర్షాలు ముంచెత్తున్నాయి. వరదలకు పట్టణాలు, పల్లెల్లు అల్లాడి పోతున్నాయి. అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే.. ఎక్కువ కురిసినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ప్రతి సంవత్సరం జూన్ ఒకటో తేదీ నుంచి వాతావరణశాఖ లెక్కలను నమోదు చేస్తుంది. ఈ క్రమంలో ఈ సీజన్‌లో రాష్ట్రంలో సెప్టెంబర్ 2వ తేదీ వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 587.2 మిల్లీ మీటర్లు కాగా.. 794.7 మిల్లీమీటర్లు కురిసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. శనివారం, ఆదివారం, సోమవారం మాత్రం రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్‌లో వర్షపాతం నమోదైంది.
ఆ తర్వాత ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌లో కురిసింది. ఈ సీజన్ మొత్తానికి చూసుకుంటే.. నారాయణపేటలో అత్యధికంగా వర్షాలు కురిసినట్లు ఐఎండీ చెప్పింది. సాధారణ వర్షపాతం కంటే.. 123 శాతం ఎక్కువ వానలు నారాయణపేటలో పడినట్లు వెల్లడించింది. ఆ తర్వాత ములుగు 98శాతం, మహబూబాబాద్ 90శాతం కురిసినట్లు తెలిపింది. గత మూడు రోజుల్లో అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం కురిసినట్లు హైదారాబాద్ ఐఎండీ పేర్కొంది. ఆ జిల్లాలో 72 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసినట్లు తెలిపింది. ఈ సీజన్ మొత్తానికి అయితే.. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా వర్షాపాతం నమోదైంది. ఇక్కడ సాధారణం కంటే.. తక్కువే కురిసింది.
జిల్లాల్లో ఒక్కో చోట వేర్వేరుగా..
వాస్తవానికి ఒకే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతాల్లో భారీ తేడాలు నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తిలో ఆదివారం దాదాపు 40 సెంటీమీర్లు, నారాయణపేట జిల్లాలో ఓ గ్రామంలో ఏకంగా 46సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ వానలు పడిన నేపథ్యంలో.. ప్రతి జిల్లాలో పడిన వర్షపాతాన్ని యావరేజ్ చేసి ఐఎండీ ఈ వివరాలను వెల్లడించింది.
ఈ ఏడాది సీజన్‌తో పాటు, గత మూడు రోజుల పాటు కురిసిన వర్షాల వివరాలు (మి.మీ.)
జూన్ 1-సెప్టెంబర్ 2వరకు ఆగస్టు 31-సెప్టెంబర్2వరకు
జిల్లా సాధారణం కురిసింది సాధారణం కురిసింది
మహబూబాబాద్ 705.2 1,102 21.7 338.8
సూర్యపేట 474.8 766.5 10.8 290.5
ఖమ్మం 624.7 904.8 17.1 266
వరంగల్ 749.9 869.9 26.5 256.4
కామారెడ్డి 630.5 795.1 24.9 221
భద్రాద్రి కొత్తగూడెం 782.8 1,099 19.9 219.7
నాగర్ కర్నూలు 356 705.3 16.6 210.8
మహబూబ్ నగర్ 387.2 735.3 12.9 207.6
మెదక్ 630.6 712.8 16.3 205.3
వనపర్తి 407.6 716.2 13.8 184.8
జనగాం 535.3 645.1 18 174.5
నారాయణపేట 347 773.9 11.6 174.4
సిద్ధిపేట 489 676.1 15.6 172.6
ములుగు 816.6 1386 20.3 165.8
రాజన్న సిరిసిల్ల 557 813 21 164.8
కరీంనగర్ 557.9 879.8 18.8 159
పెద్దపల్లి 714 1,003 19.9 139.8
నిర్మల్ 735.5 905.5 22.3 137.4
జగిత్యాల 988.7 657.3 21 135.2
నిజామాబాద్ 682.9 828.4 23.3 131.1
వికారాబాద్ 509.8 595.5 19.3 138.9
నల్లగొండ 377.6 450.6 14.6 116.9
సంగారెడ్డి 553.3 510.4 18.4 115.3
హన్మకొండ 550.2 836.9 22.8 114
యాదాద్రి భువనగిరి 402.3 483.5 10.9 107.9
కొమురంభీం అసీఫాబాద్ 822.7 1012 27.6 107.3
రంగారెడ్డి 409.5 438.2 13.7 105.5
ఆదిలాబాద్ 795.9 840.5 27 105.1
హైదరాబాద్ 476.2 588.9 18 103
మేడ్చల్ 403.6 585.7 14 100.5
జోగులాంబ గద్వాల్ 330.1 559.7 10.5 88.2
మంచిర్యాల 786.1 876.8 20.6 85.1
జయశంకర్ భూపాలపల్లి 1,032 820.6 26.2 72






