calender_icon.png 20 September, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో భారీ వర్షం

20-09-2025 01:14:48 AM

  1. రోడ్లపై పారిన వర్షపు నీరు

జన జీవనం అస్తవ్యస్తం.. వాహనదారుల ఇబ్బందులు

హైదరాబాద్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): హైదరబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. సిటీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా నగర పరిధిలోని హయత్‌నగర్ ప్రధాన రహదారిపై మోకళ్లలోతు నీళ్లు ప్రవహించాయి. పెద్ద ఎత్తున టాఫిక్ జామ్ అయింది.

మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.జూబ్లీహిల్స్, బంజారహిల్స్, పిలింనగర్, మణికొండ, గచ్చిబౌలి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, సనత్‌నగర్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్‌బీ నగర్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, తుర్కయాంజల్, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పాతబస్తీలో కూడా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంబంధిత శాఖల అధికారులు రంగంలో దిగి సహాయక చర్యలు ప్రారంభించారు.   

మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల,

నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ సాధారణ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ఆది, సోమవారాల్లో కూడా పల్లు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.