20-09-2025 12:47:59 AM
సూర్యాపేట,(విజయక్రాంతి): ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం దురదృష్టకరమని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి రాంబాబు యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి మధును పరామర్శించి ఆర్థిక సాయమందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భార్య, భర్తలు ఇరువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కావడంతో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.
తమ పిల్లలకు పుట్టినరోజు కూడా బట్టలు కొనివ్వలేని పరిస్థితి రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైండన్నారు. ఈ ప్రభుత్వంలో ఆత్మహత్యలు జరిగితేనే జీతాలు వేస్తారా అని ప్రశ్నించారు. గత ఏడాది కూడా ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న తర్వాతే జీతాలు వేశారన్నారు. ఆరు నెలలుగా జీతాలు లేకపోతే వారు కుటుంబాలను ఎలా పోషించుకోవాలో చెప్పాలన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న జీతాలు అన్నీ చెల్లించాలన్నారు. పోరాడి సమస్యలు పరిష్కరించుకుందాం తప్ప ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు.