calender_icon.png 20 September, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి

20-09-2025 01:12:27 AM

-పరిష్కార మార్గాలు చేపట్టనున్న అధికారులు

-హెసీఎస్‌సీ, నగర పోలీసుల ఆధ్వర్యంలో ‘ట్రాఫిక్ సమ్మిట్-2025’..

-కృత్రిమ మేధ, డ్రోన్లతో పర్యవేక్షణ  

హైదరాబాద్ సిటీ బ్యూరో సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): కోట్లాది వాహనాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర రోడ్లపై ట్రాఫి క్ చిక్కుముడులు విప్పేందుకు, పౌరులకు సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు నిపుణులు, అధికారులు, పాలసీ మేకర్లు ఏకతా టిపైకి వచ్చారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ,నగర పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో రెండు రోజుల పాటు జరిగిన ట్రాఫిక్ సమ్మిట్ - 2025 దీనికి వేదికైంది.

నగర రవా ణా, రోడ్డు భద్రతకు సంబంధించిన సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికతను జోడించి, వినూత్న పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా ఈ సదస్సు ఫలవంతంగా ముగిసింది.ఈ సదస్సును తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రోడ్డు భద్రత అనేది కేవలం నిబంధనలు, జరిమానాలకు సంబంధించిన విషయం కాదు, దానికి ఒక భావోద్వేగ అనుబంధం ఉంటుం ది. పిల్లలు క్షేమంగా ఇల్లు చేరడం, అంబులెన్సులోని రోగి సమయానికి ఆస్పత్రికి వెళ్ల డం, పౌరులు ఒత్తిడి లేని ప్రయాణం చేయగలగడమే నిజమైన రోడ్డు భద్రత లక్ష్యం అని అన్నారు.

ప్రభుత్వ,ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తున్న సేవలు అభినందనీయమని, ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, నగరంలో ఇప్పటికే 92 లక్షల వాహనాలు ఉన్నాయి, వీటికి తోడు ప్రతిరోజూ 1,500 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ పెను సవాలును ఎదుర్కోవడానికి సంప్రదాయ పద్ధతులు సరిపోవన్నారు. ఈ సమ్మిట్‌లో భాగంగా ఆధునిక సిగ్నల్ వ్యవస్థలు, వీఐపీ కాన్వాయ్ నిర్వహణ, గూగుల్‌తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  వినియోగం, డ్రోన్లు, హై-రైజ్ కెమెరాలతో పర్యవేక్షణ వంటి అధునాతన సాంకేతిక పద్ధతులపై నిపుణులతో విస్తృతంగా చర్చించాం అని తెలిపారు. ఇకపై నగ ర కమిషనరేట్ పరిధిలో తాన్లా పల్స్ యాప్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.

నా అన్నను రోడ్డు ప్రమాదంలో కోల్పోయా: హీరో కిరణ్ అబ్బవరం 

సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యువ హీరో  కిరణ్ అబ్బవరం భావోద్వేగంతో ప్రసంగించారు. కొన్నే ళ్ల క్రితం మా అన్నయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ ఘటన నా జీవితాన్ని మార్చేసింది. అప్పటివరకు ట్రాఫిక్ నిబంధనల పట్ల సీరియస్‌గా లేని నేను, ఆ తర్వాత పూర్తిగా మారిపోయాను. ఇప్పుడు స్టీరింగ్ పట్టుకునే ప్రతిసారీ, నాకోసం ఎదురుచూసే కుటుంబం ఉందని గుర్తుచేసుకుంటాను. యువకులు సరదా కోసం, ఎంజాయ్‌మెం ట్ కోసం ఇతరుల ప్రాణాలను బలి తీసుకోవద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు. సదస్సులో ప్రముఖ సినీ నటుడు  సాయి ధరమ్ తేజ్,  సి. శేఖర్ రెడ్డి, అడిషనల్ సీపీ  విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ డి. జోెుల్ డేవిస్, నాగ్, టౌన్ ప్లానర్ ,మహీప్ సింగ్ థాపర్, పలువురు ఉన్నతాధికారులు, పాల్గోన్నారు.