calender_icon.png 20 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఈఓ రాంబాబు పదవి విరమణ వీడ్కోలు

20-09-2025 12:44:02 AM

గుమ్మడిదల: మండలంలోని బొంతపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించి అదే మండలానికి విద్యాధికారి విధులు నిర్వహించిన రాంబాబు కి శుక్రవారం ఎంపీ ఆర్ఆర్ గార్డెన్ లో ఘనంగా పదవి విరమణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, నాయకులు మాట్లాడుతూ... ఒక తండ్రి తన ఇంటిని సక్రమంగా చూసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో ప్రధానోపాధ్యాయుల నుండి మండల విద్యాధికారి అయినప్పటి నుండి తాను మండల స్థాయి పాఠశాలలను ఎంతో ప్రేమగా చూసుకున్నారని తనతో మాట్లాడితేపై అధికారితో కాకుండా తోటి ఉపాధ్యాయులతో మాట్లాడినట్టు ప్రేమగా చిరునవ్వుతో మాట్లాడుతారని అలాంటిది కొందరికి మాత్రమే ఉంటుందని తాను పదవి విరమణ అవుతున్నాడని కొంచెం బాధాకరం అనిపించిన రోజులు గడిచినప్పటికీ జీవితానికి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.

ఎంఈఓ రాంబాబు మాట్లాడుతూ... విద్యారంగంలో అడుగుపెట్టి నేటికీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవి విరమణ పొందుతున్నానంటే నాకు వింతగా ఉందని అప్పుడే అన్ని సంవత్సరాలు అయిపోయాయా అన్నట్టుగా ఉందని నేను పదవి విరమణ చేయడం అనేది ఉద్యోగానికి మాత్రమేనని నా జీవితంలో విరమణ అనేది ఉండదని చివరి సమయంలో గుమ్మడిదల మండలంలోని ప్రధానోపాధ్యాయులుగా వచ్చి ఇదే మండలానికి విద్యాధికారిగా బాధ్యతలు నిర్వహించి ఇక్కడే ఉద్యోగ విరమణ పొందడం అనేది చాలా ఆనందకరమైన విషయమని తెలిపారు.ఈ ఉద్యోగ ప్రయాణానికి సహకరించిన మా కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.