calender_icon.png 20 September, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోకేశ్-డీకే మధ్య ‘బ్లాక్ మెయిల్’ వార్

20-09-2025 12:43:12 AM

  1. బెంగళూరులో గుంతల రోడ్లంటూ సీఈవో పోస్ట్
  2. స్పందించిన ఏపీ మంత్రి లోకేశ్
  3. బ్లాక్ మెయిల్ కుదరదన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే
  4. ఏపీలో ఫిర్యాదు చేస్తే బ్లాక్‌మెయిల్ అనం అని పేర్కొన్న లోకేశ్ 

బెంగళూరు, సెప్టెంబర్ 19: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏపీ మంత్రి నారా లోకేశ్ నడుమ ఎక్స్ వేదికగా ‘బ్లాక్‌మెయిల్’ యుద్ధం నడుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బెంగళూరులో ఉన్న ‘బ్లాక్ బక్’ కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీ ఇటీవల ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శి స్తూ.. బెంగళూరు నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. ‘బెంగళూరులోని బెల్లండూర్ ఓఆర్‌ఆర్‌లో మా ఆఫీస్ ఉంది.

కానీ ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. రోడ్లపై గుంతల వల్ల మా ఉద్యోగులకు గంటన్నర పైనే పడుతుంది. రోడ్డు మొత్తం గుంతలమయంగా మారిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అనుకుంటున్నాం’ అని రాజేశ్ ఎక్స్‌లో పే ర్కొన్నారు. కాగా ఈ ట్వీట్‌పై ఏపీ మంత్రి లోకేశ్ స్పందించారు. విశాఖకు రావాలని, వి శాఖలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఇదే విషయంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు.

ఇటువంటి బ్లాక్ మెయిల్‌ను ప్రభుత్వం పట్టించుకోదంటూ ఘాటు వ్యా ఖ్యలు చేశారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 1,100 కోట్లు కేటాయించిందని, కాంట్రాక్టర్లకు నవంబర్ డెడ్‌లైన్ విధిం చామన్నారు. అక్కడితో ఊరుకోని లోకేశ్ బ్లాక్‌మెయిల్‌ను సాగదీశారు. ‘ఇతర రాష్ట్రాల కు ఏపీకి ఉన్న తేడా ఇదే. మా ప్రజల ఫి ర్యాదులను బ్లాక్‌మెయిల్ అంటూ తోసిపు చ్చం. ఆ ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం’ అని  ఎక్స్‌లో పేర్కొన్నారు.