calender_icon.png 21 October, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షం వచ్చింది.. నిండా ముంచింది

21-10-2025 07:04:52 PM

వలిగొండలో భారీ వర్షం..

వలిగొండ (విజయక్రాంతి): మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో భారీ వర్షం రావడంతో ధాన్యం తడిసి రైతులను నిండా ముంచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వలిగొండ మండలంలో దాదాపు అరగంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు కాలువలై, డ్రైనేజీలు నదులై ప్రవహిస్తూ పొంగిపొర్లాయి. వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో రైతులు పోసిన ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఇంకెన్ని రోజులకు ధాన్యం కొనుగోలు చేస్తారంటూ రోజుల తరబడి మార్కెట్ యార్డ్ లోనే ఉంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.