21-10-2025 07:02:56 PM
బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్..
బెల్లంపల్లి, (విజయక్రాంతి): విధి నిర్వహణలో పోలీసు అమరవీరులు చూపిన తెగువ, త్యాగాలు మరువలేనివని బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్మృతి కేంద్రం వద్ద వివిధ సంఘటనల్లో అసువులు బాసిన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏసిపి రవికుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ఎప్పుడూ ముందుండాలన్నారు. ప్రజల రక్షణ, ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతూ పోలీసు శాఖకు గుర్తింపు తేవాలని సబ్ డివిజన్ పోలీసులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వన్ టౌన్, బెల్లంపల్లి రూరల్, తాండూర్ సిఐలు శ్రీనివాసరావు, హనూక్, నీలాల దేవయ్య లతోపాటు ఏ ఆర్ ఇన్స్పెక్టర్లు, సబ్ డివిజన్ పరిధిలోని పలువురు ఎస్సైలు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.