భారీ వర్షం..తీవ్ర నష్టం
- ఐదు గంటల పాటు ఏకదాటి వర్షం
- రోడ్లపై పడిన చెట్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు
- లోతట్టు ప్రాంతాలు జలమయం
కామారెడ్డి, జూన్ 9 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 5 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాలు గ్రామాలు మండల కేంద్రాలలో భారీ వర్షం కురవడంతో రైతన్నలలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మృగశిర కార్తి రోజు కాకుండా మరుసటి రోజు తెల్లవారుజాము నా రెండున్నర గంటల నుంచి ఉదయం 7 గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సాయిబాబా గుడి రోడ్డు వద్ద వరద నీరు భారీగా రావడంతో రాకపోకలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. గాంధీనగర్, అయ్యప్ప నగర్, బతుకమ్మ కుంట, ఆర్.బి నగర్, దేవి విహార్, తదితర ప్రాంతాలలో లోతట్టు గల ఏరియాల్లో భారీ వరద నీరు చేరుకొని రాకపోకలకు తీవ్రతరాయంగా ఏర్పడింది. లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న వారి ఇండ్లలోకి వరద నీరు చేరింది. వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాటు ఎల్లారెడ్డి బాన్సువాడ పిట్లం మద్నూర్ జుక్కల్ గాంధారి సదాశివ నగర్ తిక్కనూర్ మాచారెడ్డి బి బి పేట, తదితర మండలాల్లో గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మెట్ట భూముల్లోపంటలు వేసేందుకు అణువుగా వర్షం కురిసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోరు బావుల కింద వర్షం నీరు చేరడంతో మొక్కజొన్న, సోయా లాంటి ఆరుతడి పంటలు వేసేందుకు కొంత ఇబ్బందులు ఏర్పడిన జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం ఏకధాటిగా కురవడం ప్రజలకు చల్లదనం చేకూరినట్లుంది.
వేడిమి వాతావరణం నుంచి చల్లటి వాతావరణం రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షానికి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ గోడ కూలిపోయింది. కాకతీయ నగర్, విద్యుత్ నగర్, గాయత్రి నగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరి రాకపో పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ సిబ్బంది అధికారులు పర్యవేక్షించి మురికి నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులతో క్లియర్ చేయించారు.
మద్నూర్, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, పెద్ద కోడపుగల్ తదితర మండలాల్లో రోడ్లపై చెట్లు విరిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు చేరుకొని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. రోడ్లపై పడిన చెట్లను పక్కకు తొలగించారు.
తాడువాయిలో
తాడ్వాయి, జూన్, 9( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో సోమవారం భారీగా వర్షం కురిసింది ఈదురుగాలతో కూడిన వర్షం పడడంతో చెట్లు విరిగిపడ్డాయి మండలంలోని ఎర్రపహడు శివారులో చెట్టు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోవులకు తీవ్ర అంతరాయం కలిగింది మండలంలో కురిసిన భారీ వర్షానికి రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.
ఖరీఫ్ సీజన్ కావడంతో పంటలు పెట్టడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు ఈ సంవత్సరం వర్షాకాలం ముందే ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
సదాశివనగర్ మండలంలో.
సదాశివనగర్, జూన్ 09 (విజయక్రాంతి), మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు గాలి రావడంతో కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు చెట్లు విరిగిపడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షం 73.5 మీ. మీటర్ల వర్ష పాతం నమోదు అయినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు.






