16 April, 2026 | 4:05 PM

అంతర్రాష్ట్ర పార్తి దొంగల ముఠా అరెస్ట్

10-06-2025 01:11 AM
  1. పరారీలో..పార్తిముఠాకు చెందిన మరొకరు 
  2. నగలు,  నగదు స్వాధీనం నలుగురి అరెస్ట్, రిమాండ్ 
  3. పట్టుబడిన ముఠా సభ్యుల పై ఇతర రాష్ట్రాల్లో కేసులు 
  4. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి

కామారెడ్డి, జూన్ 9 (విజయ క్రాంతి), దారి దోపిడీలకు పాల్పడుతున్న పార్తి దొంగల ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సోమవారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పార్టీ ముఠా వివరాలను వెల్లడించారు. జాతీయ రహదారులపై  వివిద జిల్లాలలోని గ్రామలలో తాళం వేసిన ఇండ్లలో దోపిడీలకు పాల్పడిన  అంతర్రాష్ట్ర పార్థి దొంగల ముఠా సబ్యు లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

వారి వద్ద నుంచి నేరాలకు ఉపయోగిస్తున్న మారణాయుధాలు స్వాధీనం  చేసుకున్నట్లు తెలి పారు.  గత ఆరు నెలలుగా కామారెడ్డి, నిర్మ ల్, నిజామాబాద్ జిల్లాలలో,  జాతీయ రహదారులపై జరుగుతున్న దారి దోపిడిలు ఇండ్లలో దోపిడి విషయమై గాంధారి పోలిస్  స్టేషన్  లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు,

ఇదే విధంగా కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బీర్కూర్, సదాశివనగర్, మద్నూర్, తాడ్వాయి, కామారెడ్డి జిల్లా కు సంబంధీచిన పోలిస్ స్టేషన్ల లో, నిజామాబాద్ జిల్లా కు సంబందించిన  ఇందలవాయి పోలిస్  స్టేషన్ , నిర్మల్ జిల్లాకు సంబంధీచిన సొన్ పోలిస్  స్టేషన్ లాలో ఈ ముఠా వారిపై కేసులు  నమోదు అయినట్లు తెలిపారు.

ఈ నేరాలలో నిందితులు రహదారుల పై  ఆగి ఉన్న వాహన దారులను లక్ష్యం గా చేసుకొని వారి పై  మారణా ఆయుధా లతో దాడి చేసి దారి దోపిడి కి పాల్పడుతూ   రహదారులకి దగ్గరలో ఉన్న గ్రామాలలోని తాళాలు వేసి ఉన్న ఇండ్లను, ఇండ్లలో ఎవరైనా ఉన్నట్టు అయితే వారి పై మారణా ఆయుధా లతో దాడి  చేసి ఇండ్లలో దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. 

ఇట్టి  కేసుల విషయ ములో కామారెడ్డి జిల్లా  ఎస్పి శ్రీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు చోరీ కేసులను చేధించుటకై 2 స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేశారు.  2 స్పెషల్ టీమ్ లలోని అధికారులు వారి వద్ద ఉన్న కొద్దిపాటి ఆధారాలకు  సాంకేతిక పరిజ్ఞానం జోడించి దర్యాప్తును వేగవంతం చేశారు.

సోమవారం ఉదయం గాంధారి మండల లోని మొండిసడక చౌరస్తా వద్ద గాంధారి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై బాన్సువాడ నుండి గాంధారి వైపుకు  వస్తు  పోలీసు వారిని చూసి వారి వాహనాలను వదిలేసి పారిపోతుండగా గాంధారి పోలీసులు అట్టి ముగ్గురిని పట్టుకొని విచారించగా వారు నలుగురు సబ్యుల ఒక మూటగా ఏర్పడినారాని వారు గతంలో పలు నేరాలకు పాల్పడినట్లు తెలిపారు.

ప్రస్తుతం అంతరాష్ట్ర ముఠా లో (3) ముగ్గురు సభ్యులతో పాటుగా నేరానికి సంబండిచిన సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కోర్టు కు హాజరుపర్చడం జరుగుతుందన్నారు. పరారీలో ఉన్న ముఠాలోని ఇంకో  సభ్యుడు ఏ టు భాస్కర్ చౌహాన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతనిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. 

పార్టీ దొంగల ముఠాకు చెందిన నాందేడ్ జిల్లా ముదికేడ్ తాలూకా మంగ్యాల్ తండా కు చెందిన నామ్ దేవ్ అలియాస్ రామ కృష్ణ బోస్లే, కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఔరధి తాలూకా గ్రామానికి చెందిన కృష్ణ బాబు సిందే, మహారాష్ట్ర లోని ముదిఖేడ్ కు చెందిన రాథోడ్ అజిత్ రమేష్ అలియాస్ అజయ్, నాందేడ్ జిల్లా ముదిగేడు తాలూకా చందోల్ తండా చెందిన గజానంద్ రామారావు లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

భాస్కర్ చౌహాన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిపై గతంలో మహారాష్ట్రలోని ఉదగిరి రూరల్ నీలంగా పోలీస్ స్టేషన్లలో హత్య ఆధ్యాయయత్నం కేసులు నమోదు చేయబడినట్లు తెలిపారు. వీరిని కోర్టులో ఆధారపరచడం జరుగుతుందన్నారు.

వీరి వద్ద నుంచి మూర్తులాల బంగారు అభరణాలు, 12 తులాల వెండి అభరణాలు, రెండు కత్తులు, రెండు టార్చిలైట్లు రెండు ఫ్యాన్లు అడ్జస్ట్ టేబుల్ స్పానర్ ఒకటి మొబైల్ ఫోన్స్ మూడు స్వాధీనం చేసుకుని కోర్టుకు నివేదించినట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, ఎస్త్స్రలు ఆంజనేయులు, రంజిత్ ,ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రాజేందర్ శ్రావణ్ లక్ష్మీకాంత్ స్వామి మైసయ్య రవి మిగతా పోలీస్ సిబ్బంది ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి లు అభినందించారు.

ముఠా సభ్యులపై గతంలో మహారాష్ట్రలోని ఉద్గిరి రూరల్ మరియు నీలంగా పోలీస్ స్టేషన్లో హత్య మరియు  హత్యాయత్నం కేసులు నమోదు చేయబడ్డాయి.  ముఠా సభ్యులలోని   నలుగురు  నిందితులను (A1,A3 to A5) లను గాం ధారి పీఎస్ 83 /2025 కేసులో సెక్షన్ 309 (4) BNS  (రాబరీ ) and Sec 25(1) Arms Act యందు  అరెస్టు చేశారు. కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. 

స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు

బంగారం ఆభరణాలు  3 తులలు, వెండి ఆభరణాలు -12 తులలు, కత్తులు -02, ఇనుపరాడ్డు -01, టార్చి లైట్స్ -02, పనాలు -02, అడ్జస్టేబుల్ స్పానర్ -01,మొబైల్ ఫోన్స్  -03.కేసు దర్యాప్తులో చాకచక్యంగా ప్రద ర్శించిన  సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సదాశివనార్ సీఐ సంతోష్ కుమార్, SI లు ఆంజనేయులు, రంజిత్, ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిసిఎస్ సిబ్బంది అయిన గణపతి, శ్రీనివాస్, రాజేందర్, శ్రావణ్, లక్ష్మీకాంత్, స్వామి, మైసయ్య, రవి,  అభినందించారు. మిగతా సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి  అభినందించినారు.