calender_icon.png 31 October, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగామ జిల్లాలో అధిక వర్షపాతం నమోదు

29-10-2025 07:27:31 PM

- అత్యధికంగా పాలకుర్తి 182.5 శాతం అధికం

- అత్యల్పంగా తరిగొప్పుల 17.8 శాతం అధికం

- మత్తడి పారుతున్న చెరువులు.. కుంటలు

జనగామ (విజయక్రాంతి): జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి కారణంగా అంచనాకు మించి వర్షాలు ఒక్కసారిగా సాధారణం కంటే భారీ వర్షాలు కురిసాయి. అప్పటివరకు లోటు వర్షపాతం ఉండగా, బుధవారం రోజున అత్యధికానికి చేరుకోవడం గమనార్హం. సగటుకు మించి.. జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే అదనంగా వానలు కురిసినట్లు అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆరుగలం శ్రమించి పండించిన పంటను విక్రయించుకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కొనుగోలు చేపట్టకపోవడంతో ఇప్పటికే రైతులు ఐకెపి సెంటర్లో ధాన్యం ఉంచగా అకాల వర్షానికి ధాన్యం తడవడం వలన.. మరింత వర్షం జోరు అందుకుంది. జిల్లాలోని 19  మండలాల్లో అతి అత్యధిక వర్షాలు కురవగా, మిగిలిన మండలాల్లో అత్యధికంగా వర్షాలు కురిశాయి. ఉదయం నుండి కురుస్తున్న వానకు సాధరణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైంది.

ఎక్కడెక్కడ ఎంత శాతం..

జిల్లాలో సగటున సాధారణ వర్షపాతానికి మించి. వర్షం నమోదైంది. జిల్లాలోని అత్యధికంగా పాలకుర్తి మండలం గూడూరులో 182.5 శాతం, అత్యల్పంగా తరిగొప్పుల మండలంలో 17.8 శాతం వర్షపాతం నమోదైంది. దేవరప్పల మండలంలో 127.3 శాతం, లింగాల ఘన్పూర్ 108.0, రఘునాథ్ పల్లి 108.0, నర్మెట, 107.8, జనగాం 105.0, స్టేషన్గన్పూర్ మండలంలోనీ తాటికొండ 101.5, చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ 99.3, జఫర్గడ్ 81.8,  బచ్చన్నపేట78.8, వడ్లకొండ 78.0, కొడకండ్ల 75.0, కూనూర్ .64.5, శాతం, అబ్దుల్ నాగారం 61.8, పడమటి కేశవపూర్ 59.3, వర్షపాతం నమోదైంది.