calender_icon.png 31 October, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణ ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు

31-10-2025 12:34:34 PM

న్యూఢిల్లీ: రక్షణ ముసాయిదా ఒప్పందంపై భారత్-అమెరికా సంతకాలు(India US sign defense pact) చేశాయి. ఇరుదేశాల రక్షణ ఒప్పందం పదేళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఒప్పందంపై రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతకం చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిని రెండు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక కలయికకు సంకేతంగా అభివర్ణించారు. రాజ్ నాథ్(Defence Minister Rajnath Singh), అమెరికన్ కౌంటర్ పీటర్ హెగ్సేత్ మధ్య కౌలాలంపూర్‌లో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది.

భారత వస్తువులపై వాషింగ్టన్ 50 శాతం సుంకాలను విధించిన తరువాత తీవ్ర ఒత్తిడికి గురైన సంబంధాలను పునరుద్ధరించడానికి రెండు వైపులా చేసిన ప్రయత్నాల మధ్య ఈ ఒప్పందం బలోపేతం అయింది. "మేము 10 సంవత్సరాల 'యుఎస్-ఇండియా మేజర్ డిఫెన్స్ పార్టనర్‌షిప్ కోసం ఫ్రేమ్‌వర్క్'పై సంతకం చేసాము. ఇది ఇప్పటికే బలమైన మా రక్షణ భాగస్వామ్యంలో కొత్త శకానికి నాంది పలుకుతుంది" అని హెగ్సేత్‌తో చర్చల తర్వాత రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ లో పేర్కొన్నారు.

ఈ ఒప్పందం భారతదేశం-అమెరికా రక్షణ సంబంధాల మొత్తం వర్ణపటంలో విధాన దిశానిర్దేశం చేస్తుందని రక్షణ మంత్రి అన్నారు. ఇది మా పెరుగుతున్న వ్యూహాత్మక కలయికకు సంకేతం, భాగస్వామ్యానికి కొత్త దశాబ్దానికి నాంది పలుకుతుందన్నారు. "మా ద్వైపాక్షిక సంబంధాలలో రక్షణ ప్రధాన స్తంభంగా ఉంటుంది. స్వేచ్ఛాయుత, బహిరంగ, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్(indo-pacific) ప్రాంతాన్ని నిర్ధారించడానికి మా భాగస్వామ్యం చాలా కీలకమని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం "మా రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఇది ప్రాంతీయ స్థిరత్వం, నిరోధానికి ఒక మూలస్తంభం. మేము మా సమన్వయం, సమాచార భాగస్వామ్యం, సాంకేతిక సహకారాన్ని పెంచుకుంటున్నాము. మా రక్షణ సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి,"అని హెగ్సేత్ అన్నారు.