calender_icon.png 31 October, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి

31-10-2025 11:37:11 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) శుక్రవారం నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనున్నారు. రోజుకు 2 డివిజన్ల చొప్పున మూడు విడతలుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. సాయంత్రం వెంగళరావునగర్ డివిజన్(Vengalrao Nagar Division) లో సీఎం రోడ్ షో నిర్వహించనున్నారు. పీజేఆర్ సర్కిల్ నుంచి సాయిబాబా ఆలయం వరకు రోడ్ షో కొనసాగనుంది. సాయిబాబా ఆలయం వద్ద కార్నర్ మీటింగ్ లో సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం ఎల్లారెడ్డిగూడ వద్ద కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొనున్నారు. సీఎం రోడ్ షోకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్

తేదీ: 31-10-2025

సమయం: సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 

సాయంత్రం 7 గంటలకు- వెంగళరావు నగర్ డివిజన్ 

పీజేఆర్ సర్కిల్ నుంచి జవహర్ నగర్ మీదుగా సాయిబాబా టెంపుల్ వరకు రోడ్ షో 

సాయిబాబా టెంపుల్ (చాకలి ఐలమ్మ విగ్రహం) వద్ద కార్నర్ మీటింగ్ 

రాత్రి 8 గంటలకు- సోమాజీగూడ డివిజన్ 

ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా(కృష్ణా అపార్ట్ మెంట్స్ సమీపంలో) వద్ద కార్నర్ మీటింగ్.