calender_icon.png 31 October, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ ఎన్నికలకు ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల

31-10-2025 12:43:20 PM

పాట్నా: బీహార్ అసెంబ్లీ(Bihar elections) ఎన్నికల కోసం ఎన్డీఏ తన మ్యానిఫెస్టోను(NDA releases manifesto) శుక్రవారం విడుదల చేసింది. ఇతర విషయాలతో పాటు, కోటి మంది యువతకు ఉద్యోగాలు, కోటి మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దుతామని ఎన్డీయే హామీ ఇచ్చింది. మరో నాలుగు నగరాల్లో మెట్రో రైలు సేవలను, రాష్ట్రంలోని ఏడు అంతర్జాతీయ విమానాశ్రయాలను హామీ ఇచ్చింది. ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు, 10 పారిశ్రామిక పార్కులు, కేజీ నుండి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య, ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ విద్యార్థులకు నెలకు రూ. 2000 సహాయం వంటివి మ్యానిఫెస్టోలో పేర్కొంది. 

ఎన్డీఏ అధికారంలోకి వస్తే, ప్రపంచ స్థాయి వైద్య సంస్థ, ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల, ఉచిత రేషన్, రూ. 5 లక్షల విలువైన ఉచిత చికిత్స, 50 లక్షల పక్కా గృహాలను కూడా ఏర్పాటు చేస్తామని 69 పేజీల మ్యానిఫెస్టోలో పేర్కొంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్, కూటమి భాగస్వాముల నాయకులు హాజరైన విలేకరుల సమావేశంలో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.