31-10-2025 12:58:13 PM
 
							హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin sworn) తెలంగాణ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) అజారుద్దీన్ తో ప్రమాణం చేయించారు. అజారుద్దీన్ ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు హాజరయ్యారు. క్రికెటర్ గా అజారుద్దీన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా అజారుద్దీన్ పనిచేశారు. రిటర్మెంట్ తర్వాత అజారుద్దీన్ రాజకీయాల్లో వచ్చాడు. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్ లో అజారుద్దీన్ జన్మించారు.
అబిడ్స్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో అజారుద్దీన్ పాఠశాల విద్య అభ్యసించారు. నిజాం కాలేజీలో అజారుద్దీన్ బీకాం చదివారు. మేనమామ జైనులాబుద్దీన్ స్ఫూర్తితో అజారుద్దీన్ అడుగులు క్రికెట్ వైపు పడ్డాయి. 1984 లో అంతర్జాతీయ క్రికెట్ లో అజారుద్దీన్ రంగ ప్రవేశం చేశారు. తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు చేసి అజారుద్దీన్ సంచలనం సృష్టించారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్(Mohammad Azharuddin career) లో అజారుద్దీన్ 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. 1989 లో టీం ఇండియా కెప్టెన్ గా అజారుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. 2009 ఫిబ్రవరి 19న అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ నియామకం అయ్యారు.