calender_icon.png 31 October, 2025 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని టవర్ ఎక్కిన యువకుడు

31-10-2025 12:12:42 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) బెజ్జూరు మండలంలోని సులుగుపల్లి గ్రామానికి చెందిన అమ్మాయి, మద్దిగూడ గ్రామానికి చెందిన అబ్బాయి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు వీరి పెండ్లిను ఒప్పుకోకపోవడంతో ఈ రోజు సులుగుపల్లి గ్రామం లో అబ్బాయి టవర్ ఎక్కాడు. విచిత్రం ప్రేమ ఇలా కూడ ఉంటుందా అని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామంలోని ప్రజలందరూ అక్కడికి చేరుకొని పెళ్లి జరిపిస్తామని తెలపడంతో ఆ యువకుడు టవర్ దిగినట్లు పలువురు తెలుపుతున్నారు. ఇట్టి విషయమై పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. ఏదేమైనా ఆ ఇద్దరి జంటను కలపాలని గ్రామ ఏదేమైనా ఆ ఇద్దరి జంటను కలపాలని  ప్రజలు  తెలుపుతున్నారు.