29-10-2025 07:28:20 PM
 
							ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ప్రజలకు భరోసా
అచ్చంపేట: మొంథా తుఫాన్ ప్రభావం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నష్టం కలిగిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వారస కల్పించారు. బుధవారం ఆయన అచ్చంపేట నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. చందాపూర్ సమీపంలోని చంద్రసాగర్ వరద ఉధృతిని పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలు.. కోతకు గురైన రహదారులను చూశారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువమంది తమకు పంట నష్టం, పశు నష్టం వాటిల్తుందని వాపోయారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. సహాయ చట్టం వేగవంతం చేయాలని సూచించారు.